తయారీ విధానం:
తయారీకి మూడు కప్పుల పాలు, మూడు స్పూన్ల చొప్పున టీపొడి, చక్కెర, మూడు యాలకులు, ఒక అనాసపువ్వు, సమానపాళ్లలో నీటిలో నానబెట్టి మెత్తగా చేసిన జీడిపప్పు, బాదంపప్పు పేస్టు పావుకప్పు, అలాగే రెండు టేబుల్ స్పూన్లు నీటిలో నానబెట్టి చేసిన గులాబీరేకల పేస్టు.
రెండు కప్పుల నీటిలో టీపొడి, గులాబీరేకుల పేస్టు కలపాలి. ఆపై అనాసపువ్వు, యాలకులు వేసి చిక్కగా మరిగించి డికాక్షన్ను వడకట్టాలి. మరొక గిన్నెలో పాలు, చక్కెర కలిపి మరిగిస్తూ బాదం, జీడిపప్పుల పేస్టు కలపాలి. ఇందులో డికాక్షన్ వేసి అయిదు నిమిషాలపాటు మరిగిస్తే చాలు. పోషకాలతోకూడిన రుచికరమైన ఛాయ్ సిద్ధం. గులాబీరేకల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ను తొలగించడంలో సహాయపడతాయి. దీన్లోని ఎ,సి విటమిన్లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో ఓత్తిడి, ఆందోళనలను దూరం చేసి సుఖనిద్రనిస్తాయి.
Raju's Resource Hub
