ఫోన్ నుంచి దూరం పెట్టి పిల్లల్లో ఏకాగ్రత పెంచే ఆట డామినోస్. ఒక బ్లాక్ని కదిపితే చాలు, దాని వెనుక ఒక క్రమ పద్ధతిలో అమర్చిన రంగుల బ్లాక్స్ అన్నీ వరసగా పడిపోతాయి. ఆ ఆటనే డామినోస్ అంటారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్లకీ ఓపికనీ, ఏకాగ్రతనీ పెంచే ఆట ఇది. డామినో బ్లాక్స్ ని ఒక నిర్ణీత దూరంలో అమరిస్తేనే వాటినన్నింటినీ ఒకేసారి పడేయగలం. దీన్నే డామినో రేస్ అంటారు. ఏమాత్రం ఏకాగ్రత తప్పినా, ఈ బ్లాక్స్ ్న ఓ పద్ధతిలో అమర్చలేం. రేస్ని పూర్తిచేయలేం. పెద్దవాళ్లంటే సరే కానీ, చిన్న పిల్లలు అంత ఓపిగ్గా ఈ బ్లాక్స్ ని అమర్చలేరు. కానీ వరసగా పెట్టిన బ్లాక్స్ ని పడగొట్టమంటే మాత్రం ఇష్టపడతారు. అందుకే పిల్లలకోసం ప్రత్యేకంగా డామినోస్ ట్రెయిన్స్ వచ్చేశాయి. ఈ ట్రెయిన్స్పైన ఉండే గొట్టంలో బ్లాక్స్ ని పెట్టుకుని బటన్ ఆన్ చేస్తే చాలు. ఆ ట్రెయిన్ బ్లాక్స్ని నిలబెట్టుకుంటూ వెళ్లిపోతుంది. ఇక పిల్లలు చేయాల్సిందల్లా వాటిని పడగొట్టడమే. పెద్దవాళ్లకీ సరదాగానే ఉంటుందీ ఆట.

డామినోస్ ఆట
Google ad
Google ad
Raju's Resource Hub