పదవీ విరమణ తర్వాత కూడా క్రమంగా ఆదాయం పొందుతూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని అందరూ అనుకుంటారు. అలాంటి సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అదే సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం (SCSS).
ఈ స్కీం ద్వారా సీనియర్ సిటిజన్లు ప్రతి నెలా దాదాపు రూ. 20 వేల వరకు డబ్బు సంపాదించవచ్చు. నష్టభయం ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయకూడదు అనుకునేవారికి ఇది ఉత్తమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇతర ప్రభుత్వ పథకాలతో పోల్చితే ఇందులో వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది. ఈ పథకం కింద ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది.
SCSS ప్రభుత్వ ఆధారిత పథకం కాబట్టి పెట్టుబడుల భద్రత గురించి ఎలాంటి భయం అవసరం లేదు. ఈ పథకంలో చేరాలంటే సమీపంలోని పోస్టాపీసు లేదా బ్యాంకులను సంప్రదించాలి. SCSS ఖాతా తెరచి డబ్బు డిపాజిట్ చెయ్యాలి.
అర్హతలు
- 60 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన వారైతే 55 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు.
- ఇండియన్ డిఫెన్స్ సర్వీసులో పని చేసి పదవీవిరమణ పొందినవారు 50 ఏళ్లకే ఈ పథకంలో చేరొచ్చు.
- భారతీయులు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. NRIలకు అవకాశం లేదు.
పెట్టుబడులు, కాలపరిమితి
- కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలతో కూడా ఈ పథకంలో చేరొచ్చు.
- గరిష్టంగా రూ.30 లక్షల వరకు ఎందులో పొదుపు చేయవచ్చు.
- ఒకరు ఎన్ని SCSS ఖాతాలైనా తెరవొచ్చు. కానీ, అన్నింటిలో కలిపి గరిష్ట పెట్టుబడి రూ.30 లక్షలు మించకూడదు.
- ఈ పథకాన్ని 5 ఏళ్ల వరకు కచ్చితంగా కొనసాగించాల్సి ఉంటుంది.
- ఐదేళ్ల కాలపరిమితి పూర్తయ్యాక, ఈ పథకాన్ని మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది.
Raju's Resource Hub
