నాగావళి నది ఒరిస్సా రాష్ట్రంలోని కహంది జిల్లాలోని తూర్పుకనుమలలో ప్రారంభమవుతుంది. నది మొత్తం పొడవు 256 కి.మీటర్లు. అందులో 161 కి.మీ. ఒరిస్సా రాష్ట్రంలో ప్రవహిస్తుంది. 2 కి.మీ. ఒరిస్సా ఆంధ్రా సరిహద్దులో, 93 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది.విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో నాగావళినది ప్రవహిస్తుంది. నాగావళి నది మీద తోటపల్లి మరియు నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించబడినవి. నాగావళి నది శ్రీకాకుళం పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఉన్న కళ్ళేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. . శ్రీకాకుళం జిల్లా, బజ్రా మండంలో నాగావళి నదిపై నారాయణపురం గ్రామం వద్ద ప్రాజెక్ట్ నిర్మించబడినది. మరియు విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలం, తోటపల్లి గ్రామం వద్ద ఇంకొక ప్రాజెక్ట్ నిర్మించబడుచున్నది. బర్హ, బల్దియా, సత్నాలియా, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగడ్డ, సువర్ణముఖి,రెల్లిగడ్డ, వేదావతి నాగావళికి ఉపనదులు.
నాగావళి నది
Google ad
Google ad
Google ad
Google ad
Google ad