
విజయవాడకు కేవలం 8 కి.మీ దూరంలో ఉండవల్లి గ్రామంలో ఉండవల్లి గృహలు ఉన్నవి. కృష్ణా నదీతీరంలో ఉన్నకొండను తొలచి నిర్మించిన గుహలు ఇవి. ఇవి విష్ణుకుండిన రాజుల కాలానివిగా ప్రసిద్ధిచెందినవి. ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్లారు. మధ్యలో ఉన్న స్థంబాలపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇక్కడ రెండవ అంతస్తులో పెద్దదైన ఒక గుహాలయము కలదు. ఈ గుహాలయములో లోదాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు. పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతాప్రతిమలతోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ను గురించి తప్పకుండా కొనియాడాలి. ఈ గుహలు బౌద్ధమత సన్యాసుల విశ్రాంతి మందిరాలుగా భావించబడు చున్నవి.
The lying idol of **Lord Vishnu** in Undavalli caves is one of a kind.
This Murti of Bhagwan Vishnu Ji is one of a kind. Sculpted from a single block of granite around the 5th century C.E, this sculpture is a testament to the architectural prowes of our ancestors.
ఎలా వెళ్ళాలి : విజయవాడ నుండి అమరావతికి వెళ్లే రోడ్డులో ఉండవల్లి గుహలు ఉన్నాయి. బస్సు సౌకర్యం కలదు. గుంటూరు వైపు నుండి వచ్చేవారు మాత్రం మంగళగిరిలో దిగి అక్కడ నుండి ఆటోలలో ఉండవల్లి సెంటర్ కు రావాలి ఉండవల్లి సెంటర్ నుండి ఆటోలలో లేక బస్ లలో గుహలదగ్గరకు వెళ్ళవచ్చు.