
కొండవీడు గుంటూరు పట్టణానికి 25 కి.మీ.దూరంలో ఉంది. 10వ శతాబ్దంలో రెడ్డిరాజులచే కొండలమీద నిర్మించబడిన కొట ఇది ప్రస్తుతం కోట శిధిలాలను మాత్రమే చూడవచ్చు. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేతికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.ఘాట్‌రోడ్డు కొత్తపాలెం వైపు నుంచి ట్రెక్కింగ్ కు అనుకూలం. కొండమీదకు మెట్లదారిగుండా నడచి వెళ్ళాలి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొండమీదకు రోడ్డు వేయటానికి ప్రయత్నాలు జరుగుచున్నవి.
ఎలావెళ్ళాలి : గుంటూరు నుండి చిలకలూరిపేట వెళ్ళేదారిలో బోయపాలెం దగ్గరనుండి కుడివైపు రోడ్డు కొండవీడు గ్రామానికి వెళతుంది. అక్కడ నుండి కోటమీదకు వెళ్లవచ్చు. గుంటూరు నుండి షుమారు 25 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరుకు రైలు, రోడ్డు మార్గాలద్వారా చేరుకోవచ్చు. ఒంగోలు (దక్షిణం నుండి వచ్చేవారు) ప్రాంతంమీదుగా వచ్చేవారు బోయపాలెం దగ్గరనుండి ఎడమవైపు రోడ్డుకు తిరిగి కొండవీడుకు వెళ్లవచ్చు.
Raju's Resource Hub