
చిత్తూరు జిల్లాలో తిరుపతికి దగ్గరలో చంద్రగిరిలో ఉన్న చంద్రగిరి కోట ఒకటప్పటి విజయనగర రాజధానిగా భావించబడుచున్నది. మరియు అరవీడు వంశంవారికి సంబంధించినది. ఈ కోట వేయు సంవత్సరాల క్రితం కట్టబడి క్రమక్రమంగా అభివృద్ధి చేయబడినది. చంద్రగిరి కోట 183 మీటర్ల ఎత్తున్న కొండమీద బలమైన గోడలతో నిర్మించబడినది మరియు శత్రువులు కోటలో ప్రవేశించకుండా చుట్టూ కందకం ఏర్పాటుచేయబడినది. కోట క్రింది భాగంలో రెండు అంతస్తులుంటాయి. క్రింది అంతస్తు రాతితోను పైన అంతస్తు ఇటుకలతోనూ నిర్మించబడినది. దీనిలో ప్రధానమైనది రాజ్ మహల్ చంద్రగిరి కోటకు తూర్పున చంద్రగిరి పట్టణం కలదు. చంద్రగిరి ప్రాముఖ్యతను వివరించే శబ్ద మరియు లైట్ ప్రదర్శన ఏర్పాటు చేయబడినది.
వివరాలు: మెదటి ప్రదర్శన :
తెలుగు భాషలో వివరించే ప్రదర్శన :
నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు : సాయంత్రం గం.06-30 ని.లనుండి 07-15 ని, వరకు
మార్చి నుండి అక్టోబర్ వరకు : రాత్రి గం.07-00 ల నుండి గం. 07-45 ని.లవరకు
రెండవ ప్రదర్శన : ఇంగ్లీష్ లో- నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు :
రాత్రి గం.07-30 ల నుండి 08-15 ని.లవరకు
మార్చి నుండి అక్టోబర్ వరకు : రాత్రి గం.08-00 ల నుండి గం.08-45 ని.లవరకు
ప్రవేశరుసుము : పెద్దలకు రూ.20-
పిల్లలకు రూ.10 –
ఇతర వివరాలకు : +91-8574-72249 నెంబరులో సంప్రదించగలరు.
చంద్రగిరి కోటకు ప్రయాణ సౌకర్యాలు : తిరుపతి నుండి 12 కి.మీ. దూరంలో ఉన్న చంద్రగిరి కోటకు బస్సులలో లేక సాంతవాహనాలలో వెళ్ళవచ్చు.
Raju's Resource Hub