
కొండారెడ్డి బురుజు గా పేరుపొందిన కర్నూలు కోట చూడదగినది. ఈ కోట విజయనగర రాజు అచ్యుత రాయలచే నిర్మించ నిర్మించబడినదని అంటారు. ప్రసిద్ధి చెందిన ఈ నిర్మాణం ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. కొండారెడ్డి ఋజవును చెరసాలగా వాడేవారు.కొండారెడ్డి బురుజు కొండారెడ్డి కోటలోని ఒక భాగం. కర్నూలు జిల్లా మధ్యభాగంలో ఈ కోట ఉన్నది. ఈ ఋజువు కర్నూలు రైల్వే స్టేషన్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హైదరాబాద్ లోని మహబూబ్ నగర్ లో ఉన్న ఆలంపూర్ కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 17వ శతాబ్ధంలో ఆలంపూర్ నవాబు కొండారెడ్డిని ఈ కోటలో బంధించి ఉంచటంతో కాలక్రమేణా కొండారెడ్డి ఋజువు అనే పేరు వచ్చింది.
ఈ కోట చాల వరకు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, కొన్ని భాగాలు ఇంకా బలంగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఎర్ర బురుజు. ఈ బురుజు క్రింది భాగంలో రెండు చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి. ఈ బురుజు లో గుప్త నిధులు ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ నిధులను కనుగొనడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు,చెక్కడాలు ఉన్నాయి.
Raju's Resource Hub