అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ లోని పేరుపొందిన ఆలయాలలో అన్నవరం దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ప్రతి రోజూ భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తుల పాలిట కొంగుబంగారంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరం గ్రామంలో రత్నగిరి అనే కొండపై కట్టబడింది. ఆలయ సమీపంలో పంపానది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయబడింది. మెట్లమార్గం గుండా కూడ నడచి వెళ్ళవచ్చు. అన్నవరం అనగానే సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగగా జరుపుకోవటం గుర్తుకు వస్తుంది. ఇక్కడ స్వామివారి ప్రసాదం తిరుపతి లడ్డూ ప్రసాదం లాగా పేరుపొందినది.
దర్శన సమయాలు :
సర్వదర్శనం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12-30 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం గంటల 1 నుండి రాత్రి 9-00 గంటల వరకు వసతి సౌకర్యం: యాత్రికులు బస చేయటానికి దేవస్థానం వారి కాటేజ్ లు మరియు సత్రాలు అందుబాటులో కలవు. ఎలా వెళ్లాలి…? అన్నవరం కలకత్తా – మద్రాసు జాతీయ రహదారిపై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడకి 45 కి.మి. దూరంలో ఉంది. అన్నవరం గ్రామంలో రైల్వే స్టేషన్ కలదు. విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది. రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్లవచ్చు. వసతి. పూజలు మరియు ఇతర వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్ సందర్శించండి : Devasthanam Website : www.annavaramdevasthanam.nic.in
అన్నవరం ప్రసాదం ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చు? దాని రెసిపీ ఏమిటి?
కావలసిన పదార్ధాలు:
- 1 cup ఎర్ర గోధుమ రవ్వ
- 1 cup పంచదార
- 1 cup బెల్లం తురుము
- 1/3 cup నెయ్యి
- సెనగబద్దంత జాజికాయ ముక్క
- 1/4 tsp పటిక (alum)
- 4-5 యాలకలు
- 2 చిటికెళ్ళ కుంకుమపువ్వు
- 3 కప్పుల నీళ్ళు
తయారు చేయు విధానము:
- జాజికాయ, పటిక, యాలకలు, కుంకుమపువ్వు వేసి బాగా దంచి పక్కనుంచుకోండి.
- అడుగు మందంగా ఉన్న మూకుడులో గోధుమ నూక వేసి సన్నని సెగ మీద కలుపుతూ నూక తెల్లగా అయ్యేదాకా వేపుకుని పక్కనుంచుకోవాలి.
- అదే మూకుడు లో 3 కప్పుల నీరు పోసి హై-ఫ్లేం మీద ఎసరుని తెర్ల కాగనివ్వాలి. ఎసరు మరుగుతుండగా వేపుకున్న రవ్వ వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేం మీద రవ్వని మెత్తగా ఉడకనివ్వాలి
- ఉడికిన రవ్వలో పంచదార పోసి కరిగించి మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాలు ఉడికిస్తే మంచి రంగులోకి వస్తుంది, అప్పుడు బెల్లం తురుము వేసి కరిగించుకోవాలి.
- బెల్లం పూర్తిగా కరిగి పాకం పైకి తేలి ప్రసాదం కుతకుతలాడుతూ ఉడుకుతుంది, అప్పుడు నెయ్యి పోసి కదపకుండా మూతపెట్టి 5-6 నిమిషాలు వదిలేయాలి.5-6 నిమిషాలకి నెయ్యిలో మరిగి మాంచి బంగారులోకి వస్తుంది ప్రసాదం, అప్పుడు దంచుకున్న సుగంధద్రవ్యలన్నీ వేసి బాగా కలిపి చిక్కబడేదాక ఉంచి దింపెసుకోండి.
- వేడి మీదే విస్తరాకులో చుట్టి ఉంచితే ఆకు పరిమళం ప్రసాదానికి పట్టి అన్నవరం ప్రసాదం రుచి వస్తుంది.
టిప్స్:
- ఎర్ర గోధుమ నూకని మాత్రమే వాడాలి.
- కప్ గోధుమ రవ్వకి కప్ పంచదార, కప్ బెల్లం తురుము, 3-4 కప్స్ నీళ్ళు
- సహజంగా పంచదార, బెల్లం రెండూ వాడతారు ప్రసాదం లో, నచ్చితే అచ్చంగా బెల్లం కూడా వాడుకోవచ్చు పంచాదారకి బదులు.
- సహజంగా ప్రసాదాల్లో డ్రై ఫ్రూట్స్ వేస్తారు, కానీ అన్నవరం ప్రసాదంలో వేయరు.
- ప్రసాదంలో వేసే సుగంధ ద్రవయాల్లో “పటిక” చాలా ముఖ్యమైనది. పటిక ప్రసాదాన్ని చల్లారాక కూడా మృదువుగా, తేమగా ఉంచేందుకు దోహదం చేస్తుంది
- పటిక అంటే నీటిని శుభ్రపరచడానికి, ఇంకా ఇంటికి దృష్టి దోషం పోవడానికి కడతారు. దీన్నే ఇంగ్లిష్ లో alum అంటారు.
- రవ్వ ఉడికి…పంచదార, బెల్లంలో కరిగి ఆ తరువాత పాకం లో మరిగి మరిగి మాంచి రంగు తిరుగుతుంది, దానితో మాంచి రంగు రుచి వస్తుంది.
Raju's Resource Hub