Logo Raju's Resource Hub

వేలన్ కన్ని – దివ్యత్వం ఆవరించిన ప్రదేశం

Google ad

తమిల్ నాడు కోరమండల్ కోస్తా తీరంలో కల వేలన్ కన్ని ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడకు అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాలనుండి వస్తారు. నాగపట్టినం జిల్లలో కల వేలన్ కన్నిలో వర్జిన్ మేరీ గుడి కలదు. ఈ పుణ్య క్షేత్రం మడోన్నా వేలన్ కన్నికి అన్కితమివ్వబడినది. ఈ దేవత నే ‘అవర్ లేడీ ఆఫ్ హెల్త్’ అని కూడా అంటారు. చెన్నై నుండి వేలన్ కన్ని సుమారు 325 కి.మీ.ల దూరంలో దక్షిణ దిశగా వుండి తేలికగా చేరేది గానే వుంటుంది.

అద్భుతాలు జరిగిన భూమి

వర్జిన్ మేరీ, వేలన్ కన్నిలో 1560లో సాత్కాతరించినదని ఈ టవున్ లో ఈ కాలానికి ముందే ఆధ్యాత్మక చింతన అధికంగా ఉండేదని చెపుతారు. ప్రసిద్ధ నమ్మకాల మేరకు, మేరీ ఒక గొర్రెల కాపరిని తన బిడ్డ అయిన జీసస్ దాహం తీర్చటానికి గాను పాలు కోరింది.ఈ సంఘటన చూపుతూ అందుకు గుర్తుగా ఇక్కడ ఒక చాపెల్ నిర్మించారు. వేలన్ కన్ని ని ‘అద్భుతాల భూమి ‘ అని అంటారు. ఇక్కడ అనేక అద్భుతాలు జరిగినట్లు పట్టణంలో చెప్పుకుంటారు. వాటిలో ఒకటి చెప్పాలంటే, 17 వ శతాబ్దంలో ఒక పోర్చుగీస్ వాణిజ్య ఓడ బంగాళా ఖాతంలోని పెను తుఫానుకు గురైంది. నిరాశలో కల ఆ ఓడ నావికులు వారు సురక్షిత ప్రదేశానికి ఎక్కడకు చేరితే అక్కడ ఒక చాపెల్ నిర్మిస్తామని వర్జిన్ మేరీ కి వాగ్దానం చేసారు. ఆ ఓడ ఈ ప్రదేశానికి చేరింది. వాగ్దానం చేసిన నావికులు అక్కడే కల మేరీ చాపెల్ ను మరో మారు పునర్మించారు. ఇతిహాసం మేరకు ఈ ఓడ సరిగ్గా మేరీ జన్మదినం సెప్టెంబర్ 8 వ తేదీన అక్కడకు చేరింది. అయిదు వందల సంవత్సరాల నుండి ఈ అద్భుతాన్ని ఒక వేడుకగా లక్షలాది భక్తులు ఇక్కడకు వచ్చి అతి వైభవంగా జరుపుతారు. ఈ యొక్క ‘అవర్ లేడీ ‘ చాపెల్ దేశం లోనే ప్రసిద్ధి చెందినా క్రైస్తవ క్షేత్రాలలో ఒకటిగా నిలచింది. మరో అద్భుతం చెప్పాలంటే, ఒక హిందూ పాల మనిషి, మేరీ కి తన గిన్నె నుండి కొన్ని పాలు పోసి మరల ఆ గిన్నె లోని పాలను ఒక ఖాతాదారు కు పూర్తిగా పోయటం జరిగింది. మరొక అద్భుతం అంటే, ఒక కుంటి బాలుడు మేరీ కి మజ్జిగను అందించి తన కుంటితనాన్ని పోగొట్టుకున్నాడు.
విచారకర సంఘటన ఇక్కడ ఏమంటే, ఇక్కడి సముద్రంలో సంభవించిన పెను తుఫాను కారణంగా అతి సుందరమైన ఈ టవున్ 2004 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన చెప్పలేనంతగా దెబ్బ తిన్నది. సముద్రంలో వచ్చిన భూకంపం వేలన్ కన్ని పట్టణాన్ని ధ్వసం చేసింది. ఈ సంక్షోభంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోనే ఇది ఒక అతి పెద్ద విషాదంగా మిగిలిపోయింది. ఈ పెను తుఫాను విధ్వసం తరవాత చేపట్ట బడిన పునరావాస కార్యక్రమాలు ఊహించని రీతిలో వేగంగా సాగి మరోమారు వేలన్కన్ని పట్టణం పునరుజ్జీవం పొందింది. ఇపుడు ఈ పట్టణంలో సునామి పెను తుఫానుకు నిదర్శనాలు అంటే అవి వీడియోలలో మాత్రమే చూడగలము.
వేలన్ కన్ని లో చూసేందుకు అనేక ఆకర్షణలు కలవు. వేలన్ కన్ని బాసిలిక, మ్యూజియం ఆఫ్ ఆఫరింగ్ , శ్రిన్ డిపో, వేలన్ కన్ని బీచ్ మొదలైనవి. అద్భుత ఫౌంటెన్, హోలీ పాత్, మరియు లేడీ ట్యాంక్ చర్చి వంటివి కొన్ని టూరిస్ట్ ఆకర్షణలు. ఈ టవున్ లో అనేక ఆధునిక సౌకర్యాలు అంటే ఏ టి ఎం లు , హోటళ్లు , హోం స్టే లు, మరియు ఒక రైల్వే స్టేషన్ కలవు. గుడి డిపో లో మీకు హస్త కళల వస్తువులు, ఇతర మతపర వస్తువులు దొరుకుతాయి. ఇదే భవనంలో ఒక సమాచార కౌంటర్ కలదు. ఇక్కడ మీరు టవున్ గురించిన సమాచారం పొందవచ్చు.

వేలన్ కన్ని బీచ్



వేలన్ కన్ని బీచ్ లో ఎన్నో దుకాణాలు కలవు. పర్యాటకులకు ఈ షాపులు దేశం లోని ఇతర షాపుల కంటే విభిన్న అనుభూతిని అందిస్తాయి. తక్షణ ఫోటోలు తీయుట, ఫోటోలు, సి.డి.లు అమ్మకం, చిన్న హోటళ్లు , మొదలైనవి ఎన్నో వుంటాయి. వేలన్కన్ని లో ఆధునికత మరియు పురాతనం రెండూ వుంటాయి. కొంతమంది వాక్స్ తో చేయబడిన శరీర భాగాలను చర్చిలో వేసేందుకు అమ్ముతారు. అంటే చాలా మంది తమ వ్యాధుల నివారణకు ఇక్కడకు వస్తారు. ఇక్కడ స్విమ్మింగ్ అందరూ కోరతారు. సముద్రం చాలా లోతు. అనేక మంది సముద్ర స్నానాలు చేయటం చూడవచ్చు.
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading