📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

మీఠా పారే

మీఠా పారే

మీథే పారేను ఉత్తర భారతదేశంలో షక్కర్ ‌పారా, షక్కర్‌ పారే అని కూడా అంటారు. ఇది సాధారణంగా ఉత్తర భారతీయులు తరచుగా చేసుకునే సాంప్రదాయక ఆహారంలో ఇది ఒకటి. ఈ స్వీట్ సాయంత్రం టీ – టైం లో స్నాక్స్ కోసం సెలక్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, ఈ మీథే పారే స్వీట్‌ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ డిష్ గొప్పదనం ఏంటంటే, దీన్ని ఏకంగా వారం పాటు గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్లలో నిల్వచేసుకుని తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రుచికరమైన మీథే పారేని ఎలా తయారు చేయాలో ఇప్పుడే చూసేద్దాం.


ప్రధాన పదార్థం: 

250 గ్రాములు మైదా ప్రధాన వంటకానికి.  3 టీ స్పూన్ నెయ్యి,  1/2 కప్ చక్కర, అవసరాన్ని బట్టి నీళ్ళు

Step 1:
ఒక గిన్నెను తీసుకుని, అందులో నీరు, చక్కెర వేసి బాగా కలపండి. చక్కెర పూర్తిగా నీటిలో కరిగేవరకు కలపండి.
samayam telugu
Step 2:
ఈ మిశ్రమంలో నెయ్యిని వేసి 3 నుండి 4 నిమిషాలపాటు మళ్లీ కలపండి. ఆపై అందులో మైదాని వేసి మెత్తని పిండిగా తయారుచేసుకోండి. ఈ పిండి మెత్తగా మారిన తర్వాత, 1 నుండి ఒకటిన్నర గంటల పాటు పక్కన ఉంచండి.
samayam telugu
Step 3:
కొంత సమయం తరువాత, రోలింగ్ ప్లేట్ (చపాతీ పీట) మీద పిండిని వేసి, పిండిని చిన్ని చిన్ని భాగాలుగా తయారు చేయండి. రోలింగ్ పిన్‌కు నూనె రాసి, పిండిని మందంగా ఫ్లాట్‌బ్రెడ్‌ లా చేయండి.
samayam telugu
Step 4:
ఈ ఫ్లాట్ బ్రెడ్ ను మీరు కోరుకున్న ఆకారంలో కట్ చేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు పాన్‌లో వేయించండి. టీ, సాయంత్రం స్నాక్స్ తో ఈ క్రంచీ మీథే పారేను సర్వ్ చేయండి.
samayam telugu
Advertisement
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading