📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

స్వీట్ పొంగల్

స్వీట్ పొంగల్

సౌత్ ఇండియా వంటల్లో ఫేమస్ వంటకం స్వీట్ పొంగల్. దీనినే చక్కెర పొంగల్. అని కూడా అంటారు. ఎంతో టేస్టీగా ఉండే పండుగ సమయాల్లో అందరూ చేస్తుంటారు.


ప్రధాన పదార్థం

  • 1 కప్ బియ్యం,  1/2 కప్ పెసరపప్పు

ప్రధాన వంటకానికి

  • 1 కప్ తురిమిన టెంకాయ,  5 టీ స్పూన్ నెయ్యి, 1 కప్ బెల్లం పొడి, అవసరాన్ని బట్టి యాలకులు.  అవసరాన్ని బట్టి జీడిపప్పు,  అవసరాన్ని బట్టి నీళ్ళు
  • Step 1:
    ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో పెట్టి 4 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.
    samayam telugu
  • Step 2:

    ఇప్పుడు కుక్కర్ ఆవిరి పోయే వరకూ ఉంచి.. ఉడికిన అన్నం మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా చిదమాలి. ఇందులోనే కొద్ది కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి.
    samayam telugu
  • Step 3:
    ఇప్పుడు పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పులు వేసి వేయించి ఓ గిన్నెలోకి పక్కనతీయాలి.
    samayam telugu
  • Step 4:
    ఇప్పుడు అదే పాన్‌లో బెల్లం, నీరు వేయాలి. అందులోనే యాలకులు వేయండి. బెల్లం కరిగేలా వేడి చేయండి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో యాలకులను వేయాలి. ఇది స్వీట్ రెసిపీకి మంచి టేస్ట్‌ని ఇస్తుంది.
    samayam telugu
  • Step 5:
    బెల్లం మిశ్రమం మరుగుతున్నప్పుడు బియ్యం మిశ్రమాన్ని అందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కడపాలి.
    samayam telugu
  • Step 6:
    ఇప్పుడు పొంగల్ మిశ్రమాన్ని కొద్దిగా ఉడికిన తర్వాత అందులో నెయ్యి వేయాలి. ఇలా తయారైన పొంగల్‌ని ఓ బౌల్‌లోకి తీసుకుని జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. ఇది వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
    samayam telugu
Advertisement
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading