Logo Raju's Resource Hub

మంగళగిరి – శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం – పానకాల స్వామి మహత్యం

Google ad
ఈ దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు. పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవు. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు.
మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మచిలీట్నం నుంచి మద్రాసు వెడుతూ 1679 మార్చి 22వ తేదిన మంగళగిరి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆయన ఇక్కడే బసచేసి, ఈ మహత్తును గురించి విని, స్వయంగా కొండపైకి వెళ్లి పానకాలరాయుని సన్నిధిని పరిశీలనగా చూశారు. ఇదేదో గమ్మత్తుగా ఉందని, తనకైతే నమ్మశక్యంగా లేదన్నారు. మంగళగిరిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హేతువాదులు మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని, దీనిలో గంధకం ఉందని, ఎప్పటికైనా పేలిపోయే ప్రమాదముందని, ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేందుకే, గంధకాన్ని ఉపశమింపజేసేందుకే, నిత్యం పానకాన్ని నివేదించాలని, పూర్వీకులు దేవుని పేరిట ఈ ఏర్పాటు చేశారని వాదిస్తుంటారు. ఏది ఏమైనా ఎంత పానకం పోస్తే దానిలో సగం మాత్రమే తిరిగి రావటమనే ప్రక్రియ ఎంతో ప్రావీణ్యం కూడినది…. ఒకటి దైవ మహత్యాన్నయినా ఒప్పుకోవాలి… రెండవది .. అగ్ని పర్వతాన్ని బెల్లపు నీటి పానకం చల్లారుస్తుందని తెలుసుకున్న మన పూర్వీకుల వైజ్ఞానిక మేథస్సునైనా మెచ్చుకోవాలి…. మూడవది… అగ్ని పర్వతాన్ని చల్లార్చటానికి మొత్తం కొండలో చిన్న సొరంగం చేసి దాని బయటి భాగం మాత్రం తెరిచి అభిషేకం చేసే విధంగా చేయటం అద్భుతాలకు మించిన అద్భుతం కాదా..
Mangalagiri Sri Lakshmi Narasimha Swamy Temple, Pooja, Timings

మంగళగిరి అంటే వాస్తవానికి మంగళాద్రి … కృష్ణకు ఆవల ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ … కృష్ణకు ఈవాల మంగళాద్రి పై నారసింహుడు … దక్షిణ భారత దేశంలో కెల్లా ఎతైన గాలిగోపురం ,ఆనాడు వాసిరెడీ వేంకటాద్రి నాయుడు గారు కట్టించిన అద్భుతం .

కొండ దిగువన లక్ష్మి నరసింహుడు గాను ,కొండపైన పానకాల స్వామిగాను కొలువై ఉన్నారు .. హిరణ్యకస్యపుడిని సంహరించిన ఉగ్ర నరసింహుని ఉగ్రాన్ని తగ్గించడం కోసం పానకం పోస్తున్నామని పూజారి స్వాములు చెప్తున్నా ,కొండలోపల అగ్ని పర్వతం ఉందని అది చల్లారటం కోసం పానకం పోస్తూ ఉంటామని ఇంకొందరి వాదన ..

ఏదేమైన కన్నుల పండుగగా జరిగే స్వామి వారి కళ్యాణం ,మంగళగిరి మార్చి తిరునాళ్ల ,అనంతరం మెయిన్ బజార్లో స్వామి వారి రథోత్సవం చూసి తీరాల్సిందే కానీ చెప్పేవి కావు .

మంగళగిరి ,గుంటూరు నుంచి ఇరవై కిలోమీటర్లు ,అదే విజయవాడ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అన్నిరకాల ప్రయాణ సాధనాల ద్వారా చేరుకునే వీలుని కలిగి ఉంది … ఇప్పుడు కొండమీది పానకాల రాయుడి దగ్గరకు కూడా కార్ వేసుకుని వెళ్లిపోవచ్చు ,మా చిన్నప్పుడు నాలుగొందల పైచిలుకు మెట్లు చెంగు చెంగున గెంతుతూ వెళ్లే వాళ్ళం ..

Google ad

ఇంకా మా మంగళగిరి చేనేత గురించి చెప్పక పోతే అది పెద్ద తప్పు అవుతుంది .గుంటూరు విజయవాడలను కలుపుతూ జంటనగరాల మధ్య వాటితో పోటీ పడుతోంది మంగళాద్రి …

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading