Logo Raju's Resource Hub

ద్వారక – భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం

Google ad

ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. ఇది భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం. “చార్ ధాం” (నాలుగు ముఖ్య పవిత్ర స్థలాలు ) లో ఒకటి గా ను “సప్త పురిస్”(ఏడూ పవిత్ర నగరాలు) లో ఒకటిగా ఆధ్యాత్మిక గ్రంధాలలో భావించబడే ఏకైక నగరం ఈ ద్వారక.
 
పౌరాణిక సంబంధం భగవంతుడు శ్రీ కృష్ణుడు మేనమామ మథుర రాజు అయిన కంసుని చంపటం వల్ల, కంసుని మామ అయిన జరాసంధునికి యాదవులకు ఎడతెగని శత్రుత్వం ఏర్పడింది. జరాసంధుడు కృష్ణుని చంపటానికి పదిహేడు సార్లు దాడి చేసాడు. ఈ సందర్భం లో శ్రీ కృష్ణుడు యాదవులను భవిష్యత్తు లో ఇటువంటి దాడులనుండి తప్పించటానికి గిర్నార్ పర్వతాల గుండా ద స్టేట్ అఫ్ సౌరాష్ట్ర లేదా గుజరాత్ కు తీసుకు వెళ్ళాడు. యుద్దాన్ని వదిలి నందుకు శ్రీ కృష్ణుడు రంచ్చోద్రై (యుద్ద భూమిని వదిలిన వాడు) అని అభిమానంగా పిలువబడ్డాడు. మథుర ని వదిలి పోర్ట్ ఒఖ కి దగ్గరలోని బెయ్ట్ ద్వారకలో తన రాజ్యాన్ని స్థాపించటానికి పూనుకొన్నాడు. ఇక్కడ శ్రీ కృష్ణుడు ప్రాముఖ్యమైన జీవిత భాగాన్ని గడిపాడు. శ్రీ కృష్ణుని మరణానంతరం పెద్ద వరద ఈ నగరాన్ని ముంచేసింది. ద్వారక ఆరు సార్లు మునిగిపోయిందని నమ్ముతారు. ఇప్పటి ద్వారకని అందుకే ఈ ప్రాంతం లో ఏడవ సారి నిర్మిత నగరంగా భావిస్తారు.
పవిత్ర నగరం
 
ద్వారకకు ఆ పేరు సంస్కృతమ్ లోని ‘ద్వార్’ అనే పదం, అంటే తలుపు అనే అర్ధం నుండి వచ్చింది, ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు. విష్ణు భక్తులకు ఈ నగరం ఒక విశిష్టమైనది. ఇక్కడి జగత్మందిర్ దేవాలయం లో ద్వారకాదీష్ (శ్రీ కృష్ణుడు)ని పూజిస్తారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన నాగేశ్వర జ్యోతిర్లింగ కూడా ఈ ద్వారకలో ఉన్నది.
 
బెయ్ట్ ద్వారకభగవంతుడు శ్రీ కృష్ణుడు తన రాజ్యాన్ని స్థాపించిన ప్రదేశంగా భావించే బెయ్ట్ ద్వారక గల్ఫ్ అఫ్ కచ్ లో నెలకొని ఉన్న ఒక చిన్న ద్వీపం. ఒఖ ఓడ రేవు కు మునుపు ముఖ్య రేవుగా ఈ ద్వీపం ఉండేది. ద్వారక నుండి ఇక్కడికి చేరటానికి ముందుగా ఒఖ పోర్ట్ జెట్టికి చేరుకొని అక్కడ నుండి పడవలో ఈ ప్రదేశానికి వెళ్ళాలి. క్రీ.పూ. 3 వ శతాబ్దపు చారిత్రిక అవశేషాలు ఇక్కడ గుర్తించబడ్డాయి.
శంఖసురుని భగవంతుడు విష్ణువు సంహరించిన ప్రదేశంగా కూడా బెయ్ట్ ద్వారక ఇతిహాసం చెపుతుంది. అందుకే ఈ ద్వీపం బెయ్ట్ శంఖోధర అని కూడా పిలువబడుతుంది. బెయ్ట్ ద్వారకా లో డాల్ఫిన్ లని చూడవచ్చు. ఇక్కడ పిక్నిక్ లకు, కాంపింగ్లకు మరియు సముద్ర విహారానికి వెళ్ళవచ్చు.
భౌగోళిక విశేషాలుగుజరాత్ లోని జామ్నగర్ జిల్లాలో ఉన్నది ఈ ద్వారకా నగరం. గుజరాత్ ద్వీపకల్పం లోని పశ్చిమ భాగాన ఉన్నది ద్వారక.

ద్వారకాధీశుడి ఆలయం

Dwarakadish  temple

పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాలగుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది.
ద్వారకాధీశ్ మరియు ద్వారక రాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ శ్రీకృష్ణునికి అంకితం అయిన ఆలయమే ద్వారకాధీశ్ అనే హిందూ దేవాలయం. గుజరాత్ లోని ద్వారకలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయనిర్మాణం చారిత్మాతకమైన ద్వారకా నగరనిర్మాణం తరువాత నిర్మించబడినదని విశ్వసించబడుతున్నది. మహాభారత యుద్ధానంతరం, శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత శ్రీకృష్ణుని రాజ్యం సముద్రంలో మునిగి పోయింది. ప్రధాన ఆలయమైన జగత్ మందిర్ లేక నిజ మందిర్ ఆలయం 17 మూలస్థంభాల ఆధారంగా 5 అంతస్థులతో నిర్మించబడి ఉన్నది. ఈ ఆలయ నిర్మాణం జరిగి 2,500 ఏళ్లు అయిందని అంచనా. వల్లభాచార్యుడు మరియు విఠల్‌నాథ్‌జీ ల మార్గనిర్దేశకత్వంలో పూజాదికాలు నిర్వహించబడుతున్న ఈ ఆలయం పుష్టిమార్గ ఆలయాలలో ఒకటి.
ప్రస్తుత ఆలయం క్రీ.శ 16వ శతాబ్దంలో నిర్మించబడింది. మూల ఆలయనిర్మాణం శ్రీకృష్ణుని మనుమడైన వజ్రనాభుని చేత హరిగృహం (శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం) ఉన్న ప్రదేశంలో నిర్మించబడిందని విశ్వసించబడుతున్నది. ఈ ఆలయం భారదేశంలోని పవిత్రమైన చార్‌ధాం హిందూ భక్తియాత్రలో ఒకటిగా భావించబడుతుంది. అధ్యాత్మికవాది, సంస్కర్త అయిన 8వ శతాబ్దానికి చెందినఆదిశంకరాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయంలో కూడా ఒక మందిరం ఈ సందర్భానికి గుర్తుగా నిర్మించబడి శంకరాచార్యునికి అంకితం చేయబడి ఉన్నది. దివ్యప్రబంధాలలో సూచించబడిన విష్ణుభగవానుని 108 దివ్యప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి
ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.
ద్వారకాసామ్రాజ్యం
మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్ఫర్డ్, జర్మనీ లోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు.
బేట్ ద్వారక బేట్ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.
ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకంగా ఆలయం ఉంది.

రుక్మిణి దేవి ఆలయం
 
 
ఈ ఆలయం ద్వారకకు 2 కి.మీ దూరంలో ఉంటుంది… పూర్వం శ్రీకృష్ణుడు, రుక్మిణీ దేవి ఇద్దరు దుర్వాస మహామునిని భోజనానికి ఆహ్వానించారట… ఆ సమయంలో అతిథికి వడ్డించకుండా గంగాజలాన్ని రుక్మిణీ దేవి సేవిస్తుంది.. దానిని ఆగ్రహించిన దుర్వాసుడు రుక్మిణీ దేవికి భర్తనుండి దూరంగా ఉంటావు అని శపిస్తారట… అందుకే ఈ ఆలయం
పర్యాటక ఆకర్షణలు ద్వారకా మరియు బెయ్ట్ ద్వారకా లోని అనేక పవిత్ర దేవతా మూర్తుల విగ్రహాలకు ప్రతి ఏడూ అనేక మంది పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు. ద్వారకదిశ దేవాలయం, నాగేశ్వర జ్యోత్ర్లింగం దేవాలయం, మీరాబాయి దేవాలయం, శ్రీ కృష్ణ దేవాలయం, హనుమంతుని దేవాలయం మరియు బెయ్ట్ ద్వారకా లోని కచోరియు మొదలగు ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశాలు ద్వారకాలో ఉన్నాయి. ఇటువంటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం కల ద్వారకా అప్పటికి ఎప్పటికీ గుజరాత్ లోని ముఖ్య పర్యాటక ప్రదేశం గా ఉన్నది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. సికింద్రాబాద్, అహ్మదాబాద్ ఓఖా ఎక్స్ప్రెస్లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు.
Official website : Official Websites
 
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading