📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

పొలిటికల్ సైన్స్ విద్యార్థుల కెరీర్‌కు మార్గాలు…

Google ad
పొలిటికల్ సైన్స్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటోలను పొలిటికల్ సైన్స్‌కు ఆద్యులుగా చెబుతారు. అరిస్టాటిల్‌ను రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. ఆధునిక పొలిటికల్ సైన్స్ మాత్రం 19వ శతాబ్దంలో ఒక అకడెమిక్ సబ్జెక్టుగా రూపుదిద్దుకుంది.
 
మన దేశంలో బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కోర్సులో భాగంగా రాజ్యాంగం, రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తారు. వీటితోపాటు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సమస్యలు, యుద్ధాలు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి అంశాలను పొలిటికల్ సైన్స్ విద్యార్థులు అభ్యసిస్తారు. త్వరలో బీఏ పొలిటికల్ సైన్స్ కోర్సును పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న కెరీర్ మార్గాల గురించి తెలుసుకుందాం…
 
సివిల్ సర్వీసెస్:
బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కోర్సులో చేరినప్పటి నుంచి సివిల్ సర్వీసు పరీక్షలతోపాటు, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు నిర్వహించే గ్రూప్స్ పరీక్షలు రాయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. పొలిటికల్ సైన్స్ విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ పరీక్షల ప్రిలిమ్స్, మెయిన్‌లో ఉండే జనరల్ స్టడీస్ అంశాలపై త్వరగా పట్టుసాధించగలరు. తద్వారా మిగతా అభ్యర్థుల కంటే వీరు పోటీలో ముందు నిలిచే అవకాశం ఉంటుంది. వీరు సివిల్స్, గ్రూప్స్‌లో విజేత లుగా నిలవడం ద్వారా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉజ్వల కెరీర్, ఉద్యోగ భద్రతకు అవకాశం లభిస్తుంది.
 
జర్నలిజం :
{పస్తుతం యువతకు ఆకర్షణీయ వేతనాలతో విస్తృతంగా అవకాశాలు కల్పిస్తున్న రంగం మీడియా. వార్తా పత్రికలతోపాటు ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రోజు రోజుకూ విస్తరిస్తుండటంతో మీడియా ఉద్యోగాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు సమాజంలోని సమస్యలను అవగాహన చేసుకోవడంతోపాటు సునిశితంగా విశ్లేషించే నైపుణ్యం కలిగి ఉంటారు. మీడియాలో ప్రచురిస్తున్న, ప్రసారం అవుతున్న వార్తలు, వార్తా కథనాల్లో ఎక్కువగా రాజకీయాలు, సామాజిక సమస్యలకు సంబంధించినే. కాబట్టి పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు జర్నలిజం ఉత్తమ కెరీర్‌గా చెప్పొచ్చు. పొలిటికల్ సైన్స్‌తో రిపోర్టర్లు, సబ్‌ఎడిటర్లు, న్యూస్ రీడర్లు, యాంకర్లుగా రాణించే అవకాశముంది.
టీచింగ్ :
బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు ఆసక్తి ఉంటే బోధన రంగంలోనూ ప్రవేశించొచ్చు. స్కూల్ స్థాయిలో, కాలేజీలో, యూనివర్సిటీల్లో రాజనీతి శాస్త్రం బోధించే వారికి డిమాండ్ ఉంది. పాఠశాల స్థాయిలో టీచర్‌గా కెరీర్ ప్రారంభించేందుకు బీఏ పొలిటికల్ సైన్స్ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో లెక్చరర్‌గా చేరేందుకు బీఏ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, యూజీసీ నెట్ అర్హత, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి అర్హతలు ఉండాలి.
సోషల్ వర్‌‌క :
రాజకీయాల్లో చేరకుండా, సివిల్ సర్వీసు ఉద్యోగం లేకుండా.. సమాజ సేవకు సరైన మార్గంగా నిలుస్తోంది సోషల్ వర్‌‌క. పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ఎన్‌జీవోల(నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్) ద్వారా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల ద్వారా సమాజ సేవలో పాల్గొనవచ్చు. తద్వారా అటు సంతృప్తితోపాటు ఇటు ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకునే వీలుంది. బీఏ పొలిటికల్ సైన్స్ తర్వాత ఎంఏ సోషల్ వర్క్ పూర్తి చేసుకుంటే.. సమాజ సేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుంది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ వంటి సంస్థలు అందిస్తున్న కోర్సులు సోషల్ సర్వీస్ కెరీర్‌కు ఉపయుక్తమని చెప్పొచ్చు.
 
పొలిటికల్ సైంటిస్ట్ :
బీఏ పొలిటికల్ సైన్స్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో మార్గం… పొలిటికల్ సైంటిస్ట్. వీరు ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలు.. సమాజంపై చూపే ప్రభావాన్ని వివిధ కోణాల్లో లోతుగా అధ్యయనం చేస్తారు. అందుకే దేశంలోని అనేక సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు సైతం పొలిటికల్ సైంటిస్ట్‌ల సేవలు కోరుతున్నాయి. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ కోసం బీఏ పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ప్రయత్నించొచ్చు. ఆ అనుభవంతో వివిధ అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading