📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

‘గ్రాఫిక్ డిజైనింగ్’

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా వస్తువు కస్టమర్స్ దృష్టిలో పడాలంటే..అది ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు మార్గం.. గ్రాఫిక్ డిజైనింగ్. నేడు మీడియా నుంచి ప్యాకేజింగ్ వరకూ.. అన్ని రంగాల్లో గ్రాఫిక్ డిజైనింగ్ తప్పనిసరిగా మారింది. దీంతో నైపుణ్యం కలిగిన గ్రాఫిక్ డిజైనర్లకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు.
Career guidance దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం…

వినియోగదారులను కట్టిపడేసేలా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రకటనలు, బ్రోచర్లు, మ్యాగజీన్‌లు, కార్పొరేట్ నివేదికల కోసం ప్రొడక్ట్ డిజైన్‌లు, లే అవుట్‌లను రూపొందించే వారే గ్రాఫిక్ డిజైనర్‌లు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ వీరికి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచీకరణ, ఈ కామర్స్, డిజిటల్ మీడియా విప్లవంతో మార్కెట్‌లో వస్తువుల విక్రయానికి ప్రకటనలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తులను ఎంత ఆకర్షణీయంగా రూపొందించి, మార్కెట్‌లోకి తీసుకెళ్లగలిగితే అంతగా డిమాండ్ పెరుగుతుంది.

ఉద్యోగ అవకాశాలు :అడ్వర్‌టైజింగ్, ప్రొడక్ట్ డిజైన్, లోగో డిజైన్, మీడియా, వెబ్‌సైట్లు, పోర్టళ్ల డిజైనింగ్ వంటి వాటిలో అవకాశాలున్నాయి. ప్యాకేజింగ్ సంస్థల్లో, డిజైన్ స్టూడియోల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్ డిజైనర్లకు ప్రకటనలు, ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్‌మెంట్ డిజైన్, ప్రింట్, పబ్లికేషన్ ఇండస్ట్రీ, మల్టీమీడియా, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఇంటరాక్టివ్ మీడియా డిజైనర్స్, అడ్వర్‌టైజింగ్- కమ్యూనికేషన్, ప్యాకేజింగ్ డిజైనర్, క్రియేటివ్ ప్రొడక్ట్ వంటి విభాగాల్లో సొంతంగా పనిచేసుకోవడంతోపాటు మరికొంతమందికి ఉపాధిచూపించవచ్చు. నగరాలతోపాటు ద్వితీయశ్రేణి పట్టణా ల్లోనూ డిజైన్ స్టూడియోలు ఏర్పాటవుతున్నాయి. ఆసక్తి ఉంటే సొంతంగా స్టూడియోను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక సినిమాలు, టీవీ సీరియళ్లలో కూడా వీరికి ఆఫర్లు అందుతున్నాయి

Google ad

జాబ్ ప్రొఫైల్స్ : 
గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో గ్రాఫిక్ డిజైనర్, ప్రొడక్ట్ డిజైనర్, వెబ్ డిజైనర్, లోగో డిజైనర్, లేఅవుట్ ఆర్టిస్ట్, మల్టీ మీడియా డిజైనర్, క్రియేటివ్ డెరైక్టర్, ఆర్ట్ డెరైక్టర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు : 
గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. డిప్లొమాలో చేరాలంటే.. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేయొచ్చు. పీజీలో చేరడానికి గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

అవసరమైన స్కిల్స్ :

  • అకడమిక్‌గా ఎన్ని అర్హతలున్నా.. నైపుణ్యం లేకుంటే ఈ రంగంలో రాణించలేరు. గ్రాఫిక్ డిజైనర్‌గా రాణించాలనుకునే వారికి సృజనాత్మకత తప్పనిసరి. దాంతోపాటు సంబంధిత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్, టోపోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఇలస్ట్రేషన్స్, అడోబ్ క్రియేటివ్ యాప్స్, ఇంటరాక్టివ్ మీడియా, కోడింగ్ తదితర నైపుణ్యాలుంటే కెరీర్‌లో రాణించేందుకు అవకాశం ఉంటుంది.
  • గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే.. సృజనాత్మకతే ఏకైక సాధనం. క్లయింట్లకు సంతృప్తిని కలిగించే ఔట్‌పుట్ ఇస్తే అవకాశాలకు,ఆదాయానికి లోటుండదు. అందుకోసం వినియోగదారుల అభిరుచులను తెలుసుకొనే నేర్పు ఉండాలి. మార్కెట్‌లో ఎక్కడ అవకాశాలు లభిస్తాయో తెలుసుకోవాలి. ప్రారంభంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటే కెరీర్‌లో త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డిజైన్ ట్రెండ్స్‌ను నిశితంగా పరిశీలిస్తూ స్కిల్స్ పెంచుకోవాలి. ఈ రంగంలో ఫ్రీలాన్స్ డిజైనర్‌గా కూడా పనిచేసుకోవచ్చు.

వేతనాలు : గ్రాఫిక్ డిజైనర్లకు ప్రారంభంలో నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల వేతనం లభిస్తుంది. కనీసం ఐదేళ్లపాటు పనిచేసి నైపుణ్యాలు, అనుభవాన్ని పెంచుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే అందుకోవచ్చు.

 కోర్సులను అందిస్తున్న సంస్థలు
 గ్రాఫిక్ డిజైన్‌కు సంబంధించి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో గ్రాఫిక్ డిజైనింగ్‌పై అవగాహన పెంచుకునే వీలుంది. ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్ వంటి సంస్థలు అందించే కోర్సులు ఉపయుక్తమని చెప్పొచ్చు.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading