Logo Raju's Resource Hub

కిరణ్ బేడీ

Google ad
kiran bedi

కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ పి యస్ అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది కిరణ్ బేడి 1949, జూన్ 9వ తేదీన పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించింది. తండ్రి ప్రకాశ్ రావ్, తల్లి ప్రేమలత. డిగ్రీవరకు అమృతసర్ లో చదువుకుంటుంది. పంజాబ్ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రం చదువుకుంది. ఉద్యోగంలో చేరినతరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకొని న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందుతుంది.

1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణి. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను మరియు ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిల్ ను గెలుపొందినది. 1972లో జూలైలో మొట్టమొదటి ఐ పి యస్ గా ఎన్నికైనారు.

కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించినది (1970-72) . 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపికైంది. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగర్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోను పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందినది. తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందింది. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగసెసె అవార్డు పొందినది.

1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా మొట్టమొదట మహిళా ఐ పి యస్ ను చూసిన ప్రజలు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు.ఆ మరుసటిరోజే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది.1982లో ప్రధాని ఇందిరాగాంధి కారుని ప్రవేశంలేని చోట ఆపివుంచిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడనుండి తీసివేయించింది.
ఆ సమయాన ఆమెచూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు.1987లో నవజ్యోతి, 1994లో ఇండియావిజన్ పౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పరిచారు. కిరణ్‌ బేడీ తన ఆత్మకథ ‘ఐ డేర్‌’ పేరుతో తనే రాసుకున్నది.

Google ad
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading