నగదు రహిత లావాదేవీల నిర్వహణలో UPI ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. క్షణాల్లో డబ్బు పంపించడం, వెరిఫికేషన్ చాలా సులభంగా పూర్తవడం.. వంటి కారణాల చేత చాలామంది సురక్షితమైన మార్గంగా యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే చాలామందికి డెబిట్ కార్డు ద్వారా మాత్రమే.. యూపీఐ ట్రాన్సాక్షలు జరుపుకోవచ్చని తెలుసు. కానీ, క్రెడిట్ కార్డులతో కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. మరి మీ క్రెడిట్ కార్డును యూపీఐకి ఎలా లింక్ చేయాలి? లింక్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా లింక్ చేసుకోవాలి?
- మీరు మొదటిసారి UPIని వినియోగిస్తున్నట్లైతే.. మీ క్రెడిట్ కార్డును UPIకి లింక్ చేయడానికి ‘భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM)’ యాప్ను మీ మొబైల్ ఇన్స్టాల్ చేయాలి.
- BHIM యాప్ ఓపెన్ చేసి, అందులో ‘యాడ్ పేమెంట్ మెథడ్’ విభాగానికి వెళ్లాలి.

చెల్లింపులు ఎలా చేయాలి?
క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేయాలంటే..
మొదటగా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాలి. (లేదా) పే ఫోన్ నంబర్, పే కాంటాక్ట్స్.. ఈ రెండు ఆప్షన్స్లో ఒకదాన్ని ఎంచుకోవాలి.
ఆ తర్వాత మీ UPI ఐడీని ఎంటర్ చేసి, క్యూఆర్ కోడ్ను ధ్రువీకరించి, మీరెంత డబ్బు బదిలీ చేయాలనుకుంటున్నారో.. అంత డబ్బును ఎంటర్ చేయాలి.
పిన్ ఎంటర్ చేసి, లావాదేవీలను పూర్తిచేయాలి. ఇందులో సెల్ఫ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు.
లాభనష్టాలు
క్రెడిట్ కార్డుతో చేసే యూపీఐ పేమెంట్స్ మీద రివార్డు పాయింట్లు వస్తాయి.
యూపీఐతో క్రెడిట్ కార్డులను అనుసంధానించడం వల్ల చెల్లింపులు తేలికవుతాయి.
‘బై నౌ పే లెటర్’ సేవలను ఉపయోగించుకొని స్వల్ప వ్యవధికి రుణాలను తీసుకోవచ్చు.
స్వల్పకాలిక రుణం తీసుకొని, ఇచ్చిన టైమ్ లోపు బిల్లులు చెల్లించకపోతే.. వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

అక్కడ క్రెడిట్ కార్డు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ కన్ను ఎంచుకొని, కార్డు వివరాలు(కార్డు నంబర్, సీవీవీ, ఎక్స్పైరీ తేదీ) ఎంటర్ చేయాలి. దాని తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబరికి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడంతో యూపీఐకి కార్డు లింక్ పూర్తవుతుంది.
UPI ID క్రియేట్ చేయండిలా..
క్రెడిట్ కార్డును UPIకి లింక్ చేసిన తర్వాత.. మీరు ఓ UPI ఐడీని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆంగ్ల అక్షరాలు, నంబర్స్, స్పెషల్ సింబల్స్ ఉండాలి. ఇది ఓ ప్రత్యేక గుర్తింపుగా పని చేస్తుంది. ఈ ఐడీ ద్వారా మీ దగ్గర క్రెడిట్ కార్డు లేకపోయినా.. లావాదేవీలు నిర్వహించవచ్చు. మీ UPI ఐడీని చెక్ చేసుకోవాలనుకుంటే.. అదే యాప్ లోని ప్రొఫైల్ సెక్షన్ కి వెళ్లాలి. అందులో ‘యూపీఐ ఐడీ’ని సెలక్ట్ చేసుకొని, UPI ID చూడవచ్చు.

Raju's Resource Hub
