ఈ పూట గడిస్తే చాలు.. రేపటి గురించి మళ్లీ ఆలోచించుకోవచ్చు అనే భావన చాలామందిలో ఉంటుంది. ఈ తరహా ఆలోచనలు ఆర్థిక
విజయాలకు అతిపెద్ద అడ్డంకిగా మారుతాయి. అయితే ఆర్థిక స్వేచ్ఛ కోరుకునే ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం పలు ప్రణాళికలు
రూపొందించుకుంటారు. ఎలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్, సొంతిల్లు వంటి
ఎన్నో లక్ష్యాలతో పొదుపు ప్రారంభిస్తుంటారు. మరి ఏ తరహా ఆర్థిక లక్ష్యాలకు ఎలాంటి పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చో ఇప్పుడు
చూసేద్దామా?
1. షేర్ మార్కెట్: రిస్క్ తీసుకునే సత్తా ఉన్నవారికి ఇది ఉత్తమం. కాకపోతే దీనికి కొంచెం పరిశోధన చేయాలి. లాభనష్టాలను
ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.
2. ఈక్విటీ ఫండ్స్: అధిక వృద్ధి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక లక్ష్యాలకు ఇది
అనుకూలం.
2.1. లార్జ్-క్యాప్ ఫండ్స్: పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. స్థిరత్వం కోరుకునే వారికి ఇవి
అనుకూలం.
2.2. మిడ్-క్యాప్ ఫండ్స్: మధ్యస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. కాస్త రిస్క్ ఉంటుంది. మంచి
రిటర్నులే జనరేట్ అవుతాయి.
2.3. స్మాల్-క్యాప్ ఫండ్స్: స్టార్టప్ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
3. డెట్ ఫండ్స్: స్థిరమైన రాబడి రావాలి అనుకునేవారికి డెట్ ఫండ్స్ మంచి ఎంపిక.
3.1. షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్: సంవత్సరం కన్నా తక్కువ కాలపరిమితి ఉన్న బాండ్ల లో పెట్టుబడి పెడతాయి. అవసరమైనప్పుడు మీ డబ్బును సులభంగా విశ్రా చేసుకోవచ్చు.
3.2. మీడియం డ్యూరేషన్ ఫండ్స్: ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల మధ్య కాలంలో పెట్టుబడి పెడతాయి. కాస్త రిస్క్ తో పాటు మంచి
రిటర్నులు కావాలి అనుకునేవారికి ఇవి ఉత్తమం.
3.3. లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్: మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న బాండ్లలో పెట్టుబడి పెడతాయి. రిస్క్
తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఇలాంటి ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
4. హైబ్రిడ్ ఫండ్స్: ఈక్విటీ, డెట్ ఫండ్స్ని కలిపితే హైబ్రిడ్ ఫండ్స్. ఇవి పెట్టుబడుల వృద్ధిని, రిస్క్ ను సమతుల్యం చేస్తాయి.

5. ELSS: దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు పన్ను ఆదా చేయాలని చూసేవారికి ఈ ఫండ్స్ సరిపోతాయి. ఈక్విటీ పెట్టుబడికి
అదనంగా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు ఆఫర్ చేస్తాయి.
6. కాంట్రా ఫండ్స్: వైవిధ్యమైన పోర్ట్ఫోలియోను కోరుకునేవారు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. మార్కెట్ పడిపోయినప్పుడు, కాంట్రా ఫండ్లు పోర్ట్
ఫోలియోను కాపాడటంలో సహాయపడతాయి.
7. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్: డిపాజిట్లు, ట్రెజరీ, పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ఫండ్స్న మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఈ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ కాలం వ్యవధికి పెట్టుబడులు పెడతారు.
8. గోల్డ్ ETF: బంగారం ధర పెరుగుతుందని నమ్మేవారు గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టవచ్చు.
9. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్: మార్కెట్ క్యాపిటలైజేషన్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కోసం చూసేవారు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు.
Raju's Resource Hub
