చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందం అనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర
చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
మడికట్టుతో నువ్వు పూజచేస్తే
గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే
సిరిలక్ష్మిని కురిపించును పంటలు
జారుకట్టుతో పడకటింట చేరితే
గుండె జారీ చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే
దండాలే పెడతారు అందరు
అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది
కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోనా కన్నతల్లి ఉన్నది
చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
పసిపాపలా నిదర పోయినప్పుడు
అమ్మ చీరె మారెను ఊయలాగా
పువ్వై నువ్వు విచుకున్నప్పుడు
ఈ చీరేగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడక ఉక్కపోసినప్పుడు
ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు
ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది
చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందంగానే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర
చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
Raju's Resource Hub
