Logo Raju's Resource Hub

WORLD MEDITATION DAY – 21st December

Google ad

On 21st December, World Meditation Day brings balance to mental, physical, and spiritual wellbeing. Aligned with the Winter Solstice, it marks the start of Uttarayana, a time for inner reflection and falls six months after

ధ్యానం ఎందుకంటే..!

ధ్యానం అనగానే రకరకాల అపోహలు… అన్నీ వదిలేసిన సన్యాసులూ సాధువులే ధ్యానం చేస్తారని అనుకుంటారు. వాళ్ళు సంసార బంధాలకు, భావోద్వేగాలకు, ఉద్యోగ వ్యాపారాలకు అతీతంగా జీవిస్తారనుకుంటారు. నిజానికి ఇవన్నీ సరైన అవగాహన లేకపోవడంతో ఏర్పడే అభిప్రాయాలే!

ఈ గందరగోళానికి మూలం మనసుకు సంబంధించిన రెండు స్థితుల మధ్య తేడా తెలియకపోవడం. పూర్తిగా ఇహలోకపు విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండటం వేరు. దీన్ని ‘డిటాచ్మెంట్’ అనుకుందాం. నిత్యజీవితంలో బాధ్యతలన్నీ మనస్ఫూర్తిగా నిర్వహిస్తూనే ఫలితాల గురించి పట్టించుకోకుండా ఉండటం వేరు. ఇది ‘నాన్- ఎటాచ్మెంట్’. ధ్యానం ఈ రెండో కోవకు చెందినది. అది నిర్లిప్తతను పెంచదు, అన్నింటినీ పట్టుకుని వేళ్లాడకుండా చూస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. జీవితంలో ఎప్పుడూ ఎదురయ్యే పరిస్థితులూ సందర్భాలే అప్పుడూ ఉంటాయి. కాకపోతే కష్టాలను చూసి బెదిరిపోయి దూరంగా పెట్టడం; ఆనందాలను అంటి పెట్టుకుని ఉండటం చేయరు. కేవలం నిమిత్తమాత్రుల్లా గమనిస్తూ ఉంటారు. తమలోలోపల ఏం జరుగుతోందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఈ సాధన మనిషిని చైతన్యవంతుణ్ని చేస్తుంది. అతనిలో సున్నితత్వాన్ని పెంచుతుంది. ధ్యానం చేసేవారు సాధారణంగా ఎక్కువగా అనుభూతి చెందుతారు. ఇతరుల బాధ అర్ధమవుతుంది. అనుబంధాలను ఆస్వాదిస్తారు. బంధుత్వాలు మెరుగు పడతాయి. ధ్యానం వల్ల మనల్ని మనం కోల్పోకుండా ఇతరుల పట్ల శ్రద్ధ వహించవచ్చు. ఇతరులతో పోలిస్తే ఏళ్ల తరబడి ధ్యాన సాధన చేసిన వ్యక్తుల్లో భావోద్వేగపరమైన చైతన్యం, గాఢమైన సహానుభూతి, మెరుగైన అనుబంధాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

మనిషి మనస్తత్వానికి సంబంధించి ఒక వైరుధ్యాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఫలితాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వ్యక్తులు నిజంగా జరుగుతున్న దాని పట్ల తగినంత శ్రద్ధతో స్పందించలేరు. అనుబంధాన్ని కోల్పోతామేమోనని భయపడే మనుషులు దాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తారు. కచ్చితమైన ఫలితాలను ఆశించేవారు చేసే పని అసహజంగా ఉంటుంది. తమ పిల్లలు ఎలా ఉండాలో స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకున్న తల్లిదండ్రులు వారితో అనుబంధాన్ని నాశనం చేసుకుంటారు. పైన చెప్పుకొన్నట్లు ధ్యానం వల్ల వచ్చే నాన్- అటాచ్మెంట్ తరహా మనస్తత్వం ఉన్నవారికి ఈ ఇబ్బందులు ఉండవు. ఎప్పుడైతే ఫలితం కచ్చితంగా ఈ విధంగానే ఉండాలని ఆశించమో అప్పుడు సంఘటనల పట్ల మన స్పందన మరింత స్పష్టంగా, స్వేచ్ఛగా ఉంటుంది. ఎలాంటి భయసంకోచాలూ లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

Google ad

ధ్యానం చేసేవారు జీవితాన్నుంచి పారిపోయేవారు కాదు. అనుభవాల్లో తలమునకలు కాకుండానే జీవితాన్ని ఆస్వాదించగలరు. ఓడిపోతామన్న భయం లేకుండా సవాళ్లను స్వీకరించగలరు. భయాందోళనలు లేకుండా అనిశ్చితిని ఎదుర్కొనగలరు. ధ్యానం వల్ల మనసు నిశ్చలమూ విశాలమూ అవుతుంది తప్ప శూన్యం కాదు.

Year 2025

అందరికి నమస్తే ! ఈ గ్రూప్ లో ఉన్న వారు అందరు ప్రపంచ శాంతి దినోత్సవం 21-12-25 ఆదివారం రాత్రి 8-00 గంటలకు సందర్బంగా మీరు రిజిస్టర్ చేసుకొనుటయే గాక 15 సంవత్సరాలు నిండిన అందరిచేత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరు తో రిజిస్టర్ చేయించి ప్రాణాహుతి ప్రసారం తో కూడిన ధ్యానం ను అనుభూతి చెందెదరు. ఒక ఇంట్లో 4 లేక 5 ఫోన్ లు ఉన్న అన్నీ ఆన్ లో ఉంచి ఒక్కటి మాత్రం వినాలి. మిగతావి సైలెంట్ లో పెట్టాలి. ఎన్ని కోట్ల మంది హాజరు అయ్యారో తెలుస్తుంది.

రేపటి ఆదివారం 21-12-25 రాత్రి 7-45 కి ఫోన్ లు అన్నీ ఆన్ లో ఉంచండి. ధ్యానం సూచనలు ఇస్తా రు. ధ్యానం పూర్తి అయ్యే వరకు ఫోన్ లో ఆన్ లో ఉండాలి. పూర్తి అయిన తరువాత స్కాన్ వస్తుంది. ధ్యానం లో పాల్గొన్న వారు అందరికి డిజిటల్ సర్టిఫికెట్స్ ఇస్తా రు. నమస్తే

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading