📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Garlics / వెల్లుల్లి

Garlics / వెల్లుల్లి


ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అని మన పూర్వీకులంటారు. ప్లేగు వ్యాధిని తగ్గిస్తుంది. కోలెస్టరాల్‌ని కరిగిస్తుంది రక్తపు పోటుకి పోటును అదుపులో ఉంచేది. జీర్ణశక్తిని పెంచేది, వెల్లల్లి ప్రత్యేకతలని ఇంకా చాలా ఉన్నాయి.
వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం ‘ఏలియం సెతీవం’ (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ.
అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించారు ఇటీవల ఎల్లోపతీ వైద్యం కూడ వెల్లుల్లి విలువని గుర్తించింది.
వెల్లుల్లి గురించి….
>అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఒక బ్రిటీష్ ప్రభుత్వోద్యోగి 1890లో సేకరించిన “బోవర్ మేన్యుస్క్రిప్ట్‌ (Bower Manuscript) అనే తాళపత్ర గ్రంథం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బొడ్లియెన్ గ్రంథాలయంలో ఉంది. ఇది 6 శతాబ్దంలో రాసిన మాతృకకి నకలు. ఈ గ్రంథంలో వెల్లుల్లి ప్రస్తావన అనేక సార్లు చెప్పబడింది.
ఔషధ విలువలు…. >
వైద్య పరంగా వెల్లుల్లి అనేక జబ్బులకు దివ్యౌషధంగా వినియోగపడుతుంది. అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్‌ సల్ఫేట్‌, నైట్రిక్ యాసిడ్‌ రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లి మీద చేసిన అనేక అధ్యయనాల వల్ల ఇందులో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగించే శక్తి ఉందని వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఉందని ఈ అధ్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది. లూయీ పాశ్చర్‌ 1858లో, వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రబలిన గాంగ్రీన్‌ వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు. తూర్పు యూరప్‌ దేశాలలో వెల్లుల్లి రేకల్ని పంచదార, ఉప్పు , మొదలైన వాటిలో ఊరబెట్టి ఆ ఊరగాయని అడపాదడపా జీర్ణవృద్ధిని పెంపొందించుకోడం కోసం వాడుతూవుంటారు. వెల్లుల్లిని పొడిగా కూడా తయారుచేసుకుని నిల్వ ఉంచుకుంటారు. ఒక చెంచాలో 1/8వ వంతు వెల్లుల్లి గుండ ఒక వెల్లుల్లి రేకతో సమానంగా ఉంటుంది. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ ‘సి’ అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని 1924లోనే కనుగొనడం జరిగింది. అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడుపులో నులిపురుగుల నివారణకి, లివర్‌ (కాలేయం) వ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే గుండెజబ్బులకి దీనిని మించిన ఔషధం లేదంటారు. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. లుకోడెర్మా, కుష్ఠు వ్యాధులకి కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి దీనికి మించినది లేదు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది.
రక్తపోటుని నియంత్రించడంలోను, టెన్షన్‌ తగ్గించడంలోను, జీర్ణకోశ వ్యాధుల నివారణకి, రక్తకణాల్లో కొలస్ట్రాల్‌ శాతాన్ని అదుపుచేయడానికి వెల్లుల్లిని మించిన ఔషధం లేదు. వారాని కి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్‌ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ నిర్మూలిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగనివారిణి అనే అనవచ్చు.
వైద్యపరంగా వాడే విధానము
మనలో చాలా మందికి తరచుగా జలుబు , ముక్కు దిబ్బడ , జ్వరం వస్తు ఉంటాయి …. వారు వెల్లుల్లి రోజు ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది . అర చెంచా నేతిలో వేయించియన రెండు వెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా రోజూ తినాలి . మీ ముఖం , శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి . దీనివల్ల రక్తం శుభ్రపడి దేహకాంతి పెరుగుతుంది . అపుడు చాక్లెట్లు , మసాలా వస్తువులు తినకూడదు .
ఒక వెల్లుల్లి పాయ తిని , రాగిచెంబులో నీరు సాధ్యమైనంత ఎక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా వచ్చేసి మనం శుభ్రపడతాం , మనం తినే ఆహారంలో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టరాల్ తగ్గిపోతుంది . LDL ని నియంత్రించే anti-oxident గా పనిచేస్తుంది . ఒళ్ళు తగ్గాలని అనుకుంటున్నారా? .. సగం నిమ్మకాయ రసం లో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము , సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయం లో కొవ్వుపదార్ధాలు , పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి ( నడక). అర్ధ రాత్రి చెవిపోటు వస్తే … డాక్టర్ , మందులు దొరకవు కావున వేడిచేసిన వెల్లుల్లి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నాలుగు చుక్కలు వేయండి చెవి నొప్పి తగ్గిపోతుంది . గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ ఒక వెల్లుల్లి పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుంది . రోజూ రెండు వెల్లుల్లి పాయలను కాన్సర్ ఉన్నవారు తీసుకుంటే క్యాన్సర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమువుతుంది . మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసు నీటిలో కలిపి రోజూ తీసుకుంటే కొన్నాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి .
జాగ్రత్తలు :
వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తక్కువ మోతాదులో వాడాలి . ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది .. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది . వెల్లుల్లి కొంతమందికి పడదు .. ఎలర్జీ వస్తుంది , దురదలు , తలనొప్పి , ఆయాసం వస్తాయి . వీరు వెల్లుల్లి తినరాదు . ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు .

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading