📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

పిల్లల్ని అతి గా పొగడడం మంచి పద్ధతి కాదు

Google ad

పిల్లల ఆత్మగౌరవాన్ని పెంచి, వాళ్లలో మంచి ప్రవర్తన రావడానికి ప్రోత్సహించేలా ప్రశంసించాలి. వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఉపయోగపడేలా పొగడ్త ఉండాలి. ఇది పరిమితంగా ఉంటేనే మంచిది. మంచి ప్రవర్తన, సమయాన్ని వృథా చేయకుండా వినియోగించుకోవడమెలాగో తెలుసుకున్నప్పుడు, స్వీయ క్రమశిక్షణ కనిపించినప్పుడు పిల్లలకు ప్రశంస అందించే తీరాలి. అలాగే సహాయగుణం ఇతరులను చూసి జాలిపడటం వంటివి కూడా ప్రశంసాత్మకమై నవి. అంతేకాదు, తన పనిమాత్రమే కాకుండా ఇతరుల పని పూర్తికావడానికి కూడా కృషి చేయడం వంటివి పిల్లల్లో కనిపించే మంచి లక్షణాలు ఇటువంటి సందర్భాల్లో వాళ్లను పొగడ్తతో మరింత ప్రోత్సహించాలి. ఇవన్నీ వారిలో మరిన్ని మంచి లక్ష ణాలు నేర్చుకోవడానికి పురిగొల్పుతాయి.

Google ad

అతి వద్దు! పిల్లలను పొగిడేటప్పుడు అందులో నిజాయతీ ఉండాలి. ప్రశంసించేటప్పుడు అది నిజమా కాదా అని పెద్దవాళ్ల బాడీ లాంగ్వేజ్ను పిల్లలు గుర్తించగలరు. సమయంలో వాళ్లకు అపనమ్మకాన్ని కలిగించకూడదు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పనులు చేయడానికి అయిష్టతను పెంచిన వాళ్లం అవుతాం. అలాగే వ్యంగ్యంగానూ పిల్లలను ప్రశంసించకూడదు. పిల్లలు సాధించే చిన్నచిన్న విజయాలను పొగు డుతూనే, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను చేరాలనే అభిలా షను తెలియజేయాలి. అలాగే పొగుడుతూనే వారు సాదించ గలిగే స్థాయిలో మాత్రమే ప్రోత్సహించాలి. లేదంటే భవిష్యత్తులో తల్లిదండ్రుల ఆశయాలను అందుకోలేనప్పుడు పిల్లలు కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంది.

Google ad
Google ad
Google ad

చిన్నారులు చేసే చిన్నచిన్న పనులను ప్రశంసించాలి. అలా గని అతిగానూ చేయకూడదు. దేనికైనా మితంగా పొగుడు తూనే వారిలో ఉత్సాహాన్ని నింపాలి. అలాగే తమ పనులను తాము పూర్తిచేసుకోవడమెలాగో నేర్చుకుంటున్న స్థాయిలోనే నిన్ను మించినవాడు లేడంటూ పొగిడితే అక్కడితోనే ఆగిపో తాడు. అలాగే మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు పక్కవారి కన్నా ఎక్కువ తెచ్చుకున్నందుకు అద్భుతం అంటూ ప్రశంసించ కూడదు. మంచి ర్యాంకు తెచ్చుకున్నప్పుడు, బాగా చదివావు, అందుకే వచ్చాయి. ఈసారి మరింత పర్సంటేజీ వచ్చేలా కష్ట పడు నువ్వు చదవగలవు.. అని ప్రోత్సహిస్తే చాలు. పిల్లలు ధైర్యంగా ముందడుగు వేస్తారు.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading