నియమాలు, నిబంధనల పేరుతో బలవంతాన క్రమశిక్షణను అమలుచేస్తే.. అది కొద్ది రోజు లే పనిచేస్తుంది. కానీ స్వీయ క్రమశిక్షణను అలవాటుగా మార్చుకుంటే విజయా లెన్నో సాధించవచ్చు.
* అభివృద్ధి అనేది వెంటనే జరిగిపోయి.. రాత్రికి రాత్రే మార్పులు వచ్చేయవు అలాగే ఒకేసారి అన్ని లక్ష్యా లను సాధించాలని ఆరాటపడితే నిరాశే ఎదురవుతుంది. అందుకే ముందుగా సులువైన లక్ష్యాన్ని ఎంచుకుని సాధించడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత క్లిష్టమైన వాటిని ఎంచుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎదుగుదలకు దృఢమైన పునాదిని వేసుకోగలుగుతారు. దీంతో భవిష్యత్తులో సవాళ్లతో కూడిన లక్ష్యాలు ఎదురైనా తడబడకుండా ముందుకు వెళ్లగలుగుతారు.
* వ్యక్తిత్వం పైన పరిసరాల ప్రభావమూ ఉంటుంది. అవి ప్రశాంతంగా ఉంటే లక్ష్యసాధనకు తోడ్పడతాయి. అందుకే ముందుగా ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చూసుకోవాలి, ప్రోత్సా హకరంగా ఉండే పరిసరాలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. వాటిని అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించాలి. *
ఊహించని సవాళ్లూ, అనుకోని ఆపదలు స్వీయ క్రమశిక్షణకు ఆటంకంగా నిలుస్తాయి. అలాంటి సంద ర్బాల్లో ఎలా ప్రవర్తించాలనే దాని పైనా అవగాహన ఉండాలి. వాటిని అధిరోహించడానికి తగిన ప్రణాళికనూ సిద్ధం చేసుకోవాలి. దీంతో ఎలాంటి సవాళ్లు ఎదురైనా క్రమశిక్షణకు భంగం కలగకుండా ఉంటుంది. అలాగే సంకల్ప బలంతోనూ స్వీయ నియంత్రణ అలవడుతుంది.
* పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు కష్టంగానూ ఉండొచ్చు. అలాంటప్పుడు లక్ష్యాల విష యంలో స్పష్టత ఉంటే స్వీయ క్రమశిక్షణకు అవరోదం కలగకుండా ఉంటుంది. ఒక్కోసారి లక్ష్య సాధన విషయంలో కొన్ని సందేహాలూ తలెత్తుతాయి. వాటి నివృత్తికి కొంత సమయం తీసుకోవాలి. ఆ తర్వాత స్పష్టతతో ముందుకు వెళ్లగలుగుతారు. *
శారీరకంగా ఉత్సాహంగా ఉంటే మానసికంగానూ చురుగ్గా ఉండగలుగుతారు. అలాగని రోజూ రష్టపడి కస రత్తులే చేయనవసరం లేదు ఆటలు, నృత్యం, యోగా నడక.. వీటిలో ఇష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు. ఇది స్వీయ క్రమశిక్షణకు నిచ్చెనలా సహకరిస్తుంది.
• స్వీయ క్రమశిక్షణ అనేది గమ్యం దిశగా చేసే ప్రయాణం లాంటిది. మధ్యలో కొన్ని ఆటంకాలు వస్తే ఆదిగమించడానికి ప్రయత్నిస్తాం. అప్పుడప్పుడూ మనకు లభించే విజయాలు చిన్నవైనా, పెద్దవైనా అనందించడం. నేర్చుకోవాలి. ఈ ధోరణి సానుకూల ఆలోచనలను పెంచుతుంది. ఇదే దృక్పథాన్ని కొనసాగిస్తే అనుకున్నది. సాధిస్తారు కూడా. *
ధ్యానం ప్రాధాన్యం రోజురోజు కూ పెరుగుతోంది. ఇది స్వీయ అవగాహనకూ, నియంత్రణకు ఎంతో తోడ్ప డుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు మన ఆలోచసలూ, భావోద్వేగాలను అర్ధం చేసుకోవడానికి సహకరిస్తుంది. రోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానాన్ని సాధన చేసినా స్వీయ నియంత్రణ అలవడుతుంది.
Raju's Resource Hub
