📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Photos morphing (ఫోటో లు మార్ఫింగ్ చేస్తే భయపడొద్దు) 

యువతులు, మహిళలు వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రా మ్లో తమ చిత్రాలను అప్లోడ్ చేస్తుంటారు. కొందరు ఆకతాయిలు వాటిని మార్చింగ్ చేసి అసభ్యకరంగా తయారు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పంపి.. డబ్బు పంపాలని బ్లాక్మె యిల్ చేస్తున్నారు. ఒక్కోసారి సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. సున్నిత. మనస్కులు ఆత్మహత్యలకు పాల్పడిన సంద ర్భాలు ఉన్నాయి.

మీ ఫొటోలతో అశ్లీల చిత్రాలు రూపొందించి ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటే… నేరుగా మీరే ఫిర్యాదు చేయవచ్చు. మీ చరవాణికి వచ్చిన ఫొటోలను http://www.stopncil.org వెబ్సైట్కు పంపించాలి. ఇందులోని 9 రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఒక డిజిటల్ పింగర్ ప్రింట్ తరహాలో ఒక రేసు క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు వచ్చిన ఫొటో లను అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తే.. ఫొటోలపై సదరు వెబ్సైట్ నిఘా పెడుతుంది. ఎవరైనా ఫొటోలను సామా జిక మాధ్యమాల్లో పెడితే వెంటనే గుర్తించి తొలగిస్తుంది. ఆయా వివరాలను కూడా మీకు వెబ్సైట్ | ద్వారా తెలియజేస్తుంది.

Google ad

అంతర్జాతీయంగా నిర్వహించే ఈ వెబ్సైట్ పూర్తిగా భద్రమైందని పోలీసులు హామీ ఇస్తున్నారు. మీరు అప్లోడ్ చేసిన ఫొటోలను డౌన్లోడ్ చేయదు. డిజిటల్ సింగర్ ప్రింట్ తరహాలో ఒక ప్రత్యేకమైన ‘యాష్’ను తయారు చేస్తుంది.. వేలిముద్రను మనం ఎలాగైతే గుర్తిస్తామో డిజిటల్ ఫింగర్ ప్రింట్ తరహాలో మీ ఫొటోతో రూపొందిన ఈ ప్రత్యేకమైన ‘యాష్’.. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ అయినా వెంటనే ఫొటోలను గుర్తించి తొలగిస్తుంది. 2015లో రూపొందించిన ఈ వెబ్సైట్.. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 2 లక్షల మంది అశ్లీల చిత్రాలను తొలగించి, వారికి వ్యక్తిగత రక్షణ కల్పించింది.

• సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్ట కుంటే మేలు. • ఫొటోలు పెట్టినా.. వాటి యాక్సెస్ ఇతరులకు ఇవ్వవద్దు. మీ ప్రొఫైల్, ఫొటోలను ఇతరులు డౌన్లోడ్ చేయ కుండా లాక్ చేసుకోవాలి.• అపరిచిత వ్యక్తులు నుంచి వచ్చే రిక్వెస్ట్లను ఎట్టి పరిస్థితిలోనూ ఆమోదించవద్దు. ఎవరైనా అనుచితంగా ప్రవ ర్తిస్తే వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading