Google ad
కావల్సినవి: క్యారెట్- పావు కేజీ
సగ్గుబియ్యం- అర కిలో
గసగసాలు- రెండుచెంచాలు
జీలకర్ర- రెండు చెంచాలు
పచ్చిమిర్చి- ఎనిమిది కాయలు
ఉప్పు- సరిపడా
కొత్తిమీర : ఒక చిన్న కట్ట
తయారు చేసే విధానం : సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రంతా నానబెట్టుకోవాలి.క్యారెట్లను శుభ్రం చేసి చెక్కు తీసి తురుముకోవాలి. తరవాత అందులో పన్నెండు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. సగ్గుబియ్యం సగం ఉడికాక క్యారెట్ తురుము వేయాలి. కొత్తిమీర, గసగసాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ వేసి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పిండిలో వేసి కలిసి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికాక దింపుకొని కొద్దిగా చల్లారిన తరువాత గరిటెతో వడియాల్లా పెట్టుకోవాలి.
Google ad
Google ad
Google ad
Google ad