కార్తీక పూర్ణిమ అనేది హిందువులు, సిక్కులు మరియు జైనులు పౌర్ణమి / పూర్ణిమ రోజు లేదా కార్తీక మాసం (నవంబర్-డిసెంబర్) పదిహేనవ చంద్ర రోజున జరుపుకునే పండుగ.
కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలొస్తాయి. అలాగే దీప దానం కూడా చేయాలి. కార్తీక పూర్ణిమ రోజున ఉదయం 4:58 గంటల నుంచి ఉదయం 5:51 గంటల మధ్యన స్నానం చేసి దీప దానం చేయాలి.* శివాలయాల్లో జ్వాలతోరణం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున దీప దానం, పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందివ్వాలి.
2024 November 15th

Photo taken from my terrance gardening నిండు వెన్నెల్లో పున్నమి చంద్రుడు
At Kashi, Uttar Pradesh, India (Prime Minister Narendra Modi Constituency)



Raju's Resource Hub
