📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

కాకరకాయ పకోడి

Google ad

కాకరకాయలు : పావు కిలో
వాము 1 టేబుల్ ;స్పూను
బియ్యపు బిండి : 2 స్పూన్లు
శెనగపిండి : 250 గ్రా
అల్లం, వెల్లుల్లి : ఒకటిన్నర టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
జీలకర్ర పొడి : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
ఏదైనా నూనె ఆయిల్ : వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం
పొడవుగా ఉన్న కాకరకాయల్ని తీసుకోండి శుభ్రం చేశాక కాకరకాయలను చాకుతో పొడవుగా సన్నగా లేక చ్రకాల లాగా తరగండి. ఈ ముక్కల్ని ఉప్పు కలిపి కొద్దిగా ఉడికించండి. ఓ గిన్నెలో శెనగపిండి కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, కారం, జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో కాసిన్ని నీళ్లు పోసి కొద్ది జావగా కలపండి.
స్టవ్ వెలిగించి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత చల్లారిన కాకరకాయ ముక్కల్ని పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించండి. కాకరకాయ పకోడి తయారు.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading