📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

క్యాలిఫ్లవర్ పకోడి

Google ad

కావల్సినవి : క్యాలీఫ్లవర్ 1 పెద్దది
పచ్చి మిర్చి : 4 నిలువుగా చీల్చాలి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
కరివేపాకు కొద్దిగా : చిన్న చిన్న ముక్కలుగా చేయాలి
వాము : 1 స్పూన్
గరమ్ మసాలా : కొద్దిగా
శెనగపిండి : పావుకిలో
బియ్యంపిండి : 2 స్పూన్లు
తయారు చేసే విధానం
మొదటగా క్యాలీఫ్లవర్ ను కాడలు లేకుండా పైన ఉండే గుబ్బలాంటి భాగాలును వేరు చేయాలి. ఒక వెడల్పాటి పాత్రలో వేడినీరు పోసి అందులో కొంచెం కల్లు ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కేలీఫ్లవర్ ముక్కలను (గుబ్బలుగా ఉన్న పైభాగాలు) అందులో వేసి కొంచెం సేపు ఉంచి బాగా కడగాలి. తరువాత వీటిని చిల్లుల పాత్రలో వేసి పంపు కింద నీటి ధారలో ఒకటి రెండు నిమిషాలు ఉంచితే కేలిఫ్లవర్లోని మందుల అవశేషాలు, క్రిములు తొలగిపోతాయి.
ఇప్పడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని కేలిఫ్లవర్ ముక్కలను, తరిగిన పచ్చిమిరపకాయలను, వాము, అల్లం వెల్లులి పేస్ట్, కరివేపాకు శెనగపిండి, బియ్యంపిండి వేసి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ పకోడీల పిండిలాగా కలుపుకోవాలి. ఇష్టమున్న వారు కొద్దిగా గరమ్ మషాలా పౌడర్ కూడా కలుపుకోవాలి. మరీ జారుడుగానీ, మరీ గట్టిగాకానీ ఉండకూడదు.
తరువాత పొయ్యిమీద బాణాలీ పెట్టి తగినంత నూనెపోసి నూనె వేడెక్కిన తరువాత మనకు కావల్సిన సైజులో పిండిని తీసుకొని నూనెలో వేయాలి. దోరగా కాలిన తరువాత తీసి టిస్యూ పేపర్ మీద కానీ, న్యూస్ పేపర్ మీదకానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకుంటుంది. వేడి వేడిగా తినాలి.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading