కావలిసినవి
పాలకూర కట్టలు : 4
శెనగపిండి : పావుకిలో
ఉప్పు : తగినంత
నూనె
బేకింగ్ పౌడర్ : కొద్దిగా (చిటికెడు)
తయారు చేసే విధానం
ముందుగా పాలకూరను కాడలు తీసివేసి ఆకులను ఉప్పునీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఇందువల్ల పాలకూరలో మందుల అవశేషాలు మురికి పోతుంది.
శెనపిండిలో ఉప్పు, బేకింగ్ పౌడర్, తగినంత నీరు పోసి కొద్దిగా జావగా కలుపుకోవాలి మరీ జావగా కలపకూడదు. నూనె ఎక్కువగా పీలుస్తుంది.
పొయ్యిమీద బాణాలి పెట్టి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత పాలకూర ఆకులను శెనగపిండిలో ముంచి నూనెలో వేయాలి. దోరగా వేగిన తరువాత తీయాలి. వీటిని టిస్యూ పేపర్ మీద గానీ న్యూస్ పేపర్ మీద కానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకుంటుంది. పాలకూరను ఆకులుగా కాకుండా ముక్కలుగా తరిగి శెనగపిండిలో కలిపి కూడా పకోడీలు వేయవచ్చు.
పాలకూర పకోడీలు
Google ad
Google ad
Google ad
Google ad
Google ad