Logo Raju's Resource Hub

కోటి సోమవారం – కార్తిక మాసం శ్రవణ నక్షత్రం

Google ad

కార్తిక మాసం శ్రవణ నక్షత్రం.. ఈ రోజు దీపారాధన చేస్తే కలిగే ఫలితమిదే! కార్తిక మాసంలో శివారాధన విశేషంగా చేస్తుంటారు. ఈ మాసంలో మాత్రమే వచ్చే కోటి సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు కోటి సోమవారమంటే ఏమిటి? కోటి సోమవారం ఎలా ఏర్పడుతుంది? తదితర విషయాలను ప్రవచన కర్త గోర్తి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి వివరించారు.

సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్తిక మాసం (karthika masam) ఎంతో విశిష్టత కలిగినది. ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసమంటారు. హరి స్థితికారకుడైతే, హరుడు శుభంకరుడు. వీరిద్దరి ఆరాధన అంటే- మనం చరించే ‘స్థితిగతి’ సవ్యంగానూ, ఆచరించే ప్రతీ కర్మ శుభాలనిచ్చేదిగానూ ఉండాలన్న దానికి ప్రతీక ఈ మాసమని చెబుతారు. కార్తిక మాసం (karthika masam 2024) అందునా శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన వారాన్ని కోటి సోమవారంగా వ్యవహరిస్తారు.

“కార్తిక మాసంతో సమానమైన మాసం లేదు. శివకేశవ అభేదమైన తత్వమే ఈ మాసం. కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కలిగిన మాసం కావడం వల్ల కూడా దీనికి ఆ పేరు వచ్చింది. స్నానం.. దీపం.. దానం.. అభిషేకం.. ఉపవాసం.. వంటివి ఈ మాసంలో విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. నిత్యం స్నానం, దీపారాధన అందరూ చేస్తుంటారు. దానికీ కార్తిక మాసంలో చేసే దీపారాధనకు వ్యత్యాసం ఉంది. సాక్షాత్తూ పరమేశ్వరుని తత్వమే దీపారాధన అంతరార్థం. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడి తత్వం కలిగి దీపాన్ని వెలిగించడం దీని వెనుకున్న అంతరార్థం” “దీపానికి ఆధారం బ్రహ్మ.. దానిలో వేసే వత్తి ఈశ్వర స్వరూపం. అందులో వేసే నూనె/నెయ్యి సాక్షాత్తూ విష్ణు స్వరూపం. ఆ దీపాన్ని వెలిగించే శక్తి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటుంది. అందుకే ఆయన కార్తికేయుడు అయ్యాడు. కృత్తిక నక్షత్రంలో ఉద్భవించిన మహానుభావుడాయన. ఈ నెలలో నక్షత్రం దర్శనం చేసుకుని స్నానమాచరించాలని శివ మహాపురాణం చెబుతోంది. నిత్యం తెల్లవారుజామున ఆకాశంలో చుక్క ఉండగా స్నానం చేయాలంటారు”

“అంతేకాదు, ఈ మాసానికి దామోదర మాసం అని కూడా పేరుంది. ఎవరికైనా దానం చేస్తున్నప్పుడు ‘కార్తిక దామోదర ప్రీతయే’ అంటారు. శివ-కేశవులకు భేదం చూపిస్తే సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారని శ్రీమహావిష్ణువు తన కింకరులతో చెప్పినట్లు శివ పురాణం చెబుతోంది. ఈసారి నవంబరు 9న వచ్చిన శనివారాన్ని కోటి సోమవారంగా వ్యవహరిస్తారు. కార్తిక మాసంలో ఏ వారమైతే శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటుందో దానికి కోటి సోమవారం అని పేరు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం. ఇలాంటి రోజు రావాలంటే చాలా అరుదు. ఈ రోజు ఉదయాన్నే దీపారాధాన చేస్తే, మనకు తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే పాపం పోతుంది. (koti somavaram) కోటి శివ లింగాలను పూజించిన ఫలితం కలుగుతుంది” “నవంబరు 13న క్షీరాబ్ది ద్వాదశి, కైశిక (చిల్కు) ద్వాదశి, చాతుర్మాస్య వ్రత సమాప్తి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీమహా విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడు. మధ్యలో వచ్చే పరివర్తన ఏకాదశిరోజు మరోవైపు తిరుగుతాడు. ఈ కార్తిక మాసంలో ఏకాదశినాడు స్వామివారు నిద్రలేస్తారు. చాతుర్మాస్య దీక్ష (ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ) చేసిన వారు క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరిక దీపం వెలిగిస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది” అని సుబ్రహ్మణ్యశాస్త్రి వివరించారు.

Google ad
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading