
పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. పాపికొండలు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్ఛిమగోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్నవి. ఎక్కువభాగం తూర్పు, మరియు పశ్ఛిమగోదావరి జిల్లాలలో ఉన్నవి. ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం పాపికొండల సొంతం. పాపికొండలలోని చెట్లు ఆకులు రాల్చవు. కొండలు, జలపాతాలతో పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎండాకాలంలో చల్లగా ఉండటం చేత దీనిని ఆంధ్రా కాశ్మీరం అంటారు. పాపికొండల అడవులలో పెద్దపులులు, నల్లపులులు, అడవిదున్నలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, కోతులు, ఎలుగుబంట్లు, ముళ్లపందులు,అడవిపందులు ఇంకా వివిధరకాల పక్షులు,విషకీటకాలు, వేలాది రకాల ఔషధమొక్కలు, వృక్షాలు ఉన్నాయి. పాపికొండల మధ్య గోదావరి నది తక్కువ వెడల్పుతో రమణీయంగా ఉంటుంది. లాంచీల మీద రాజమండ్రి నుండి చేసే పాపికొండల ప్రయాణం యాత్రికులకు ఒక మరపురాని అనుభూతి. సీతారామయ్యగారి మనుమరాలు, అంజి, గోపి, గోపిక, గోదావరి వంటి సినిమాలు ఈ ప్రాంతంలోనే తీసారు.
పాపికొండలు, ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. (తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి). ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ లోని భద్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది.
పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది. రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం. పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది.పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరం, గొందూరు పోచమ్మ గండి సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.
చుట్టూ గోదారమ్మ పరవళ్లు… పచ్చని ప్రకృతి సోయగాలు… కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు… గిలిగింతలు పెట్టే చలిగాలులు… కొండల మధ్య మధ్య అందమైన సూర్యో దయం, అంతే అందమైన సూర్యాస్తమయం… రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస… మధ్యలో క్యాంప్‌ఫైర్… గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది.
పాపికొండల యాత్ర : పాపికొండల యాత్ర రాజమండ్రిలోని పట్టిసీమ రేవు, పోలవరం రేవు మరియు పురుషోత్తమపట్నం రేవు నుండి ప్రారంభమవుతుంది. పోలవరం ప్రాజెక్ట్, గండిపోచమ్మ గుడి మీదుగా బోటు ప్రయాణిస్తుంది. దారిలో దేవీపట్నం, కొరటూరు కాటేజస్, కొల్లూరు వెదురుతో నిర్మించిన హట్స్ ను బోటులో నుండి చూడవచ్చును. చివరగా ఖమ్మం జిల్లా పేరంటాలపల్లి దగ్గర బోటు ఆగుతుంది. అక్కడ సుందరమైన దృశ్యాలను యాత్రికులు చూసిన తరువాత బోటు తిరిగి వెనుకకు మరలుతుంది. పేరంటాలపల్లిలో స్థానికులు వెదురు చేసిన అలంకరణ వస్తువులను అమ్ముతారు. ఈ ప్రయాణం ఉదయం 7 గంటల నుండి సాయత్రం 7 గంటల దాకా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు ప్రైవేట్ బోట్లలో ప్రయాణం చేయవచ్చు. ఉదయపు పలహారం, మధ్యాహ్న భోజనంతో కలిపి టికెట్ ధర ఉంటుంది.
ముందుగా భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని రెండు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్నుంచి పారే నీటి పరవళ్లు, అక్కడి నుండి ఇసుక తిన్నెలను ప్రయాణికులకై భోజన వసతి. పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవతామూర్తులను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎత్తయిన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎతె్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి.




చుట్టూ ఎత్తయిన కొండలు .. చిక్కని అడవులు… మధ్యలో గోదారమ్మ ఒడిలో మెలికలు తిరుగుతూ జల విహారం చేస్తే… ‘చూసే కనులకు మనసుంటే … ఎటు చూసిన అందమే… ‘ అన్న పాట గుర్తుకొస్తుంది.పాపి కొండల మధ్య నుంచి లాంచిల్లో ప్రయాణం ఓ అద్భుత అనుభూతి. ఉదయం వెళ్తే సాయంత్రానికి రాజమహేంద్రవరం నగరానికి చేరుకోవచ్చు.
వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.
మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎత్తయిన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు.
పాపి కొండలకు రైల్వే స్టేషన్ లేదు; సమీప రైల్వే స్టేషన్ రాజమండ్రి స్టేషన్, ఇది ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన స్టేషన్లలో ఒకటి. దేశం యొక్క వివిధ ప్రాంతాలలో అనేక రైళ్ళు ఉన్నాయి. ఇది విజయవాడ నుండి 150 కిలోమీటర్లు మరియు విశాఖపట్నం నుండి 220 కిలోమీటర్లు.
జిల్లా నుండి రాజమండ్రి కి టాక్సీలో చేరవచ్చు. తూర్పు గోదావరి నుండి పాపి కొండల శ్రేణికి 35 కిలోమీటర్ల రహదారి ఉంది.ఎంతో మందికి ఎన్నో తీపి జ్ఞాపకాలు అందించిన పాపికొండల ప్రయాణం కొంత మందికి మర్చి పోలేని చేదు అనుభవాన్ని కూడా మిగిల్చింది.
Raju's Resource Hub