Logo Raju's Resource Hub

రంపచోడవరం

Google ad

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అటవీ ప్రాంతం వారాంతపు విహారానికి మంచి ప్రదేశం. ఇక్కడికి దగ్గరలోనే రంపా జలపాతం ఉంది. రంపచోడవరం నుంచి జలపాతానికి కాలినడకన వెళ్లవచ్చు. పచ్చి చెట్ల మధ్యలో నుంచి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ కొద్దిదూరం నడక సాగిస్తే.. జలపాతాన్ని చేరుకోవచ్చు. జలపాతం చూడాలంటే రూ.10 చెల్లించి టికెట్‌ తీసుకోవాలి. ఇంకా ముందుకెళ్తే కొండ పైనుంచి.. రాళ్ల మీదుగా జాలువారే నీటిధారలు కనులకు విందు చేస్తాయి. మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. జలపాతం ముందున్న మడుగులో చక్కగా స్నానం చేసి సేదతీరవచ్చు. పర్యాటకులు ఆహారం లేక స్నాక్స్, మంచినీరు తెచ్చుకోవటం మంచిది జలపాతం పరిసరాల్లో కూర్చొని తినవచ్చు.

మల్లికార్జునస్వామి ఆలయం
ఇక్కడే ప్రాచీనమైన మల్లికార్జునస్వామి ఆలయం కూడా ఉంది. ఆలయ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. కొండల మధ్యనున్న ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో నాగవంశీయులు చేత కట్టబడిందని అంటారు. కొండ ఆలయం కానీ.. స్వామి దర్శనం కొండపైనే స్వయంభువుగా వెలసాడంటారు ఈ స్వామి.

ఎలా వెళ్లాలి?
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి రంపచోడవరం 60 కిలోమీటర్లు రాజమండ్రికి అన్ని ప్రాంతాలనుండి బస్సు లేక రైళ్లలో వెళ్లవచ్చు. రాజమండ్రి నుండి బస్సులో గాని సొంత వాహనాల్లో గాని వెళ్లవచ్చు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading