Logo Raju's Resource Hub

విజ్ఞానాన్ని పెంచే కొన్ని యాప్లు

Google ad

1.Castbox : ఇందులో మంచి మంచి పాడ్ క్యాస్ట్ లను మనం వినవచ్చు.

పాడ్ క్యాస్ట్ అంటే ఆడియో రూపంలో ఉన్న సమాచారం, చాలా మంచి మంచి అంశాలకు(కథలు ,విహార యాత్రలు , చరిత్ర, వ్యక్తిత్వ వికాసం) సంబంధించిన ఆడియో సమాచారం తెలుగు ఇంగ్లీష్ లలో వినవచ్చు. ఈ పాడ్ క్యాస్ట్ వలన లాభం ఏంటంటే, మనం పని చేసుకుంటూ కూడా ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, ఉదాహరణకి వంట చేస్తూ కారు లేదా బైక్ తుడుస్తూ, ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఇలా అన్నమాట.

తెలుగులో ఉన్న మంచి మంచి పాడ్ క్యాస్ట్ లు ఉన్నాయి. నాకు బాగా నచ్చినవి కొన్ని కింద పోస్ట్ చేస్తున్నాను.

సాహిత్య రంగంలో ,సినిమారంగంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి

Google ad

KiranPrabha Telugu Talk Shows | Listen Free on Castbox.

చందమామలో వచ్చిన కథలు ఆడియో రూపంలో

Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు | Listen Free on Castbox.

టెక్నాలజీ సంబంధిత విషయాలు తెలుగులో

Telugology – telugu tech podcast | Listen Free on Castbox.

బారిష్టరు పార్వతీశం ఆడియో రూపంలో

Mana Telugu Kathalu – Nandikesudi Nomu | Listen Free on Castbox.

రేడియోలో వచ్చిన మంచి మంచి కార్యక్రమాలు శబ్ద తరంగాలు

శబ్ద తరంగాలు – ఈమాట | Listen Free on Castbox.

2.FreeGurukul : ఎన్నో మంచి మంచి తెలుగు పుస్తకాలు పి డి ఎఫ్ లు ఇందులో అందుబాటులో ఉన్నాయి, విశేషం ఏంటంటే అన్నీ కూడా అంశాలవారీగా ఉంటాయి చక్కగా, నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాలను సులువుగా మనం చదువుకోవచ్చు,వాటితో పాటుగా ఆ రోజు దినపత్రికల్లో వచ్చిన మంచి మంచి వార్తల సమూహారం ఇందులో మనం చదువుకోవచ్చు. అంతేకాదు మోటివేషనల్ వీడియోస్ కూడా అంశాలు వారీగా చూడవచ్చు.

3.NDL India: నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఇందులో మనం ఎన్నో వేల పుస్తకాలను చదువుకోవచ్చు ‌. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బడి పుస్తకాలు 1 నుంచి 10వ తరగతి వరకు అన్నీ ఇందులో అందుబాటులో ఉన్నాయి. నేను లాక్ డౌన్ లో కొన్ని తెలుగు పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుని కథలు, పద్యాలు చదివాను.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading