Google ad
భారతదేశంలో అత్యంత అద్భుతమైన సుందరమైన రైలు మార్గం అంటే అది కొంకణ్ రైలు మార్గం.
ఈ రైలు మార్గం మహారాష్ట్రలో ముంబై దగ్గర రోహా పట్టణం నుంచి కర్ణాటకలో మంగళూరు దగ్గర ఉన్న తోకూరు వరకు ఉంది. మహారాష్ట్ర, గోవా మరియు కర్ణాటక మూడు రాజ్యాలలో ఈ మార్గం వ్యాపించింది.
ఇది సముద్రం మరియు పశ్చిమ కనుములు మధ్య ఉంది, కాబట్టి చూడడానికి చాల బాగుంటుంది.
కొన్ని చిత్రాలు :
దూధ్ సాగర్ జలపాతం ముందు
రైలు ద్వారా లారీలను రవాణా చేస్తుంది
చిత్రాల మూలం – గూగుల్.
మార్గంలో ఉన్న కొన్ని పర్యాటక స్థలాలు.
౧. చిప్లున్ – మహారాష్ట్రలో ఉన్న ప్రశాంతమైన పర్యాటక స్థలం. పరశురామ ఆలయం ఉంది.
౨. రత్నగిరి – ఇది కూడా మహారాష్ట్రలో ఉంది, అల్ఫోన్సో మామిడి కోసం చాల ఫేమస్.
౩. గోవా – అందరికి తెలుసు గోవా చాల ప్రఖ్యాతం అని.
౪. కార్వార్ – కర్ణాటకలో ఉంది. ఇక్కడి బీచ్ లు చాల ప్రఖ్యాతం. భారత నావికాదళం ఇక్కడ కూడా ఉంది. కాళీ నది కూడా ఇక్కడే ఉంది.
౫. గోకర్ణ – ఇది బీచ్లు మరియు మహాబలేశ్వర దేవాలయం కోసం చాల ప్రఖ్యాతి పొందింది.
ఓం బీచ్ – గోకర్ణ.
౬. మురుడేశ్వర – సముద్ర తీరంలో ఉన్న ఇక్కడ పెద్ద శివాలయం ఉంది. పెద్ద గోపురం ఉంది.
౭. ఉడుపి – ఇది కృష్ణ ఊరు. అష్ట మఠాలు ఉన్నాయి. ఇది కృష్ణ ఊరు.
౭. కుందాపుర – ఇక్కడ సముద్రం మరియు నది మధ్య రోడ్డు (నేషనల్ హైవే) ఉంది.
౮. మంగళూరు – తుళునాడులో ప్రముఖ నగరం, బీచ్లు, ఆలయాలు అన్ని ఉన్నాయి.
భారతదేశంలో కొన్ని ‘మిస్ చేయకూడని’ రైలు మార్గాలు ఏవి?
రైలు పయనము ఎల్లప్పుడూ గుర్తుండిపోయే అనుభవము, రైలులోన ఉన్నంతవరకు వేరే లోకములో ఉన్నటుండును. ఎవరైనా సరే కిటికి ప్రక్కకే కూర్చోవలెను అని కోరుకుందురు. ఇంత మంచి రైలు పయనము ఆకర్షించే ప్రకృతి చోటుల మద్య వెళితే ఎంత అబ్బురముగా ఉండును కదా. అటువంటి తప్పక చూడదగిన రైలు మార్గముల గురించి వ్రాయబోదును.
- అరకు లోయ రైలు మార్గము (విశాఖపట్టణము నుండి అరకు వరకు) – అబ్బురపరిచే తేయాకు (టీ) తోటలు, జలపాతాలు, లోయలు, గుహలు కనువిందు చేయును.
- గోదావరి వారధి రైలు మార్గము (రాజమండ్రి నుండి వెన్నును) – గోదావరి నది సూర్యోదయము, సుర్యాస్తమయము వేళ అబ్బురపరిచును.
- హిమాలయ రైలు మార్గము (కాల్కా నుండి షిమ్లా వరకు) – ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. కొండలు, దేవదారు చెట్టు అడవులు, కనువిందు చేయును.
- డార్జిలింగ్ హిమాలయ రైలు మార్గము (జలపైగురి నుండి డార్జిలింగ్ వరకు) – ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. కంచెనజంగా, చిన్ని అడవులు, నగరాలు, తోటల దృశ్యాలు అబ్బురంగా ఉండును.
- నీలగిరి రైలు మార్గము (మెట్టుపాలయం నుండి ఊటి వరకు) – ఇది కూడా ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. పచ్చని ప్రకృతి దృశ్యాలు, అడవి కొండలు, తేయాకు (టీ) తోటలు, జలపాతాలు అబ్బురపరుచును.
- మండోవి రైలు మార్గము (ముంబయి నుండి గోవా వరకు) – అందమైన పశ్చిమ కనుమలు (Western Ghats), అరేబియా సముద్రము, కనిపించును.
- వాస్కో డ గామా నుండి లొండా వరకు – అందాల గోవా ఊళ్ళు, పశ్చిమ కనుమల (Western Ghats) జలపాతాలు, పచ్చని కొండలు కనిపించును.
- పాంబన్ వారధి రైలు మార్గము ( పాంబన్ నుండి రామేశ్వరము వరకు) – ఇది భారత దేశములోనే రెండవ అతి పొడవైన వారధి. బంగాళాఖాత సముద్రము మద్య నుండి పోవును.
- ఎడారి రైలు మార్గము (జోధ్పూర్ నుండి జైసల్మేర్ వరకు) – ఎడారిలోని రంగుల మట్టి గుడిసెలు, ఒంటెలు, సూర్యోదయం ఆకట్టుకుండును.
- చిల్కా రైలు మార్గము (భువనేశ్వర్ నుండి బ్రహ్మాపూర్ వరకు) – తూర్పు కనుమలు (Eastern Ghats), చిల్కా ఏరులోని వలస పక్షులు అబ్బురపరిచును.
- కన్యాకుమారి – తిరువనంతపురం – తమిళనాడు కేరళ వాస్తుశిల్పకళ గుడులు, కొబ్బరి తోటలు కనువిందు చేయును.
- కేరళా రైలు మార్గము (ఎర్నాకులం – కొల్లం – తిరువనంతపురం) – వృష్టజలాలు, కొబ్బరి తోటలు, పచ్చని పంటలు వాన పడుతున్నప్పుడు చూచినచో ముగ్ధులవుదురు.
- కాశ్మీర్ రైలు మార్గము ( జమ్మూ నుండి ఉదంపూర్ వరకు), (కాజిగండ్ – శ్రీనగర్ – బారాముల్లా) – అబ్బురపరిచే మంచు కొండలు, లోయలు, నదులు, అడవులు కనిపించును.
- అసోం రైలు మార్గము (గువాహతి – లుమ్డింగ్ – సిల్చూర్) – అందమైన కొండలు, తేయాకు (టీ) తోటలు కనిపించును. తేయాకు తోటల దృశ్యాలు మాత్రముయే కాదు దాని పరిమళము కూడా వెదజల్లును.
Google ad
Google ad
Google ad
Google ad