📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

ఉప్పు

Google ad

ఉప్పు తెచ్చే ముప్పు

Salt Can Cause Some Health Problems - Sakshi

ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఉప్పుని సోడియం క్లోరైడ్‌ అంటారు. మానవ శరీరం అసంఖ్యాక కణజాల నిర్మితం. కణం లోపల ఉండే పొటాషియానికి, కణం బయట ఉండే సోడియానికి ఉండే పరిమాణ నిష్పత్తి 8:1; ఇది సృష్టి ధర్మం. ప్రకృతి దత్తమైన ఆహార పదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియముల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. మన ఆహారసేవన లో ఈ రెంటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవాలి. మనం వంట వండే విధానం వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గిపోయి, సోడియం గణనీయంగా పెరిగిపోవటం. ఇది ప్రమాదకరం. లవణాన్ని ఎక్కువ తినకూడదని ఆయుర్వేదం చెప్పింది.

చరక సంహిత విమానస్థానంలో: ‘‘అథ ఖలు త్రీణి ద్రవ్యాణి న అతి ఉపయుంజీతాధికం… పిప్పలీ క్షారం లవణమితి’ అంటే పిప్పళ్లు, క్షారం (కొన్ని ద్రవ్యాల నుండి వెలికి తీసిన గాఢమైన సారం), ఉప్పు ఎక్కువ తినవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 3 – 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. (బయట కొన్న ఉప్పు, ప్రకృతి ద్రవ్యాలైన పళ్లు, ఆకు కూరలు, శాకాలు, పాలు మొదలైనవి కలిపి). కాని మనం రోజుకి 15 – 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం అనేక రోగాలకు దారి తీస్తుంది.
పరిమిత పరిమాణంలో… వాగ్భట సంహితలో: లవణం స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్ని కృత్‌ స్వేహనః స్వేదనః తీక్ష›్ణ రోచనః ఛేద భేద కృత్‌ ‘‘ రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. శరీరంలో కొవ్వును, కంతులను కరిగించి జడత్వాన్ని పోగొడుతుంది. స్వేదాన్ని కలిగిస్తుంది.
అతిగా సేవిస్తే అనర్థాలు
రక్తస్రావం, దప్పిక పెరుగుతాయి. బలం నశిస్తుంది. విషతుల్యం. సంధులలో వాపు పుడుతుంది. జుత్తు నెరుస్తుంది. బట్టతల, చర్మంలో ముడతలు, ఇతర చర్మ వికారాలు కలుగుతాయి.
సోతియుక్తో అస్రపవనం ఖలితం పలితం వలిమ్‌ తృట్‌ కుష్ఠ విషవిసర్పాన్‌ జనయేత్‌ క్షపయేత్‌ బలమ్‌
శరీరంలో నీటిని నిల్వ ఉండేట్టు చేసి, ఊబకాయం, వాపులు కలుగచేస్తుంది. రక్తనాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్త ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. తద్వారా బీపీ పెరిగి.. పక్షవాతం, హార్ట్‌ ఎటాక్, కీళ్లవాపులు వంటి వ్యాధులకు దారి తీస్తుంది. నేటి జీవనశైలి వలన ఈ వ్యాధులు కలగడానికి మరింత దోహదం చేస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్‌.. కణాలలోనికి ప్రవేశించినప్పుడే శక్తి లభిస్తుంది. కణం యొక్క పొరను దాటి గ్లూకోజ్‌ లోపలకి వెళ్లాలంటే ఇన్సులిన్‌ హార్మోను అవసరం. అక్కడ ఇన్సులిన్‌ సక్రమంగా పనిచెయ్యాలంటే ఉప్పు తక్కువ స్థాయిలో ఉండా లి. అందువల్లే మధుమేహ రోగులు ఉప్పు తక్కువ తినాలి. ఇటీవలి కాలంలో జపాన్‌ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.
ఐదు రకాల లవణాలు
సాముద్ర లవణం (90 శాతం సోడియం క్లోరైడ్‌ ఉంటుంది), ఔద్భిజ లేక రోమ లవణం (70 శాతం n్చఛి , సైంధవ లవణం (టౌఛిజు ట్చ ్ట: 70% N్చఛి ) బిడాల లవణం (కరక్కాయ, ఉసిరికాయ వంటి కొన్ని ద్రవ్యాల సారాన్ని తీసి, ప్రత్యేకంగా తయారుచేస్తారు. 40% N్చఛి ) సౌవర్చ లవణం (భూమిలోని లోపలి పొరలు, నదీ తీర ప్రాంతాలు దీనికి మూలాధారం. 30% N్చఛి )
తప్పించుకోవడం ఎలా?
నిషిద్ధం: ఊరగాయలు, నిల్వపచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వంటివి, ఉప్పు కారం చల్లిన వేపడాలు, డీప్‌ ఫ్రైలు మానేయాలి. ఉడికించిన కూరలలో నామ మాత్రం ఉప్పు అలవరచుకోవాలి. జంక్, ఫాస్ట్‌ ఫుడ్స్‌ జోలికి పోకూడదు. బజారులో ఉప్పు కొనడం తగ్గించాలి.
సేవించవలసినవి
ఫలాలు, డ్రై ఫ్రూట్స్,  కూరగాయలు, పాలు, బీట్‌రూట్, ముల్లంగి, ఆకు కూరలు, గ్రీన్‌సలాడ్సు మొదలైనవి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకురసం వంటివి. కాయగూరలు, పండ్లు మొదౖలñ నవి పెస్టిసైడ్స్, కార్బైడ్స్‌ యొక్క విష ప్రభావాలకు గురైనవే మనకు లభిస్తున్నాయి. ఆ విషాల్ని కొంతవరకు నాశనం చేయాలంటే… గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాలు ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో కాయగూరల్ని కాని, పళ్లని కాని ఓ అరగంట నానబెట్టి, అనంతరం మంచినీటితో రెండు మూడు సార్లు కడుక్కోవాలి.
గమనిక
రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను ‘రుచి రోగాలు’ అంటారు. ఇవి కూడా ‘సుఖరోగాల’ వలే అనర్థదాయకం. ఆరోగ్యప్రదమైన కొత్త రుచులను అలవాటు చేసుకోవడానికి నాలుకకు రెండు వారాల సమయం చాలు.

No photo description available.

Salt Vs Rock Salt – ఉప్పు Vs. సైంధవ లవణం – Halite (Rock Salt) |
.
ఉప్పు తో వచ్చే సమశ్యలు.
.
జాతీయ పోషకహార సంస్ధ సిఫార్సు ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకి 6 గ్రాముల కన్నా ఎక్కవ ఉప్పు తీసుకోకూడదు . కాని ప్రతి రౌజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు . ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు .ఇంటికి నిప్పు.
1. హై బీ.పి.
2. చక్కెర వ్యాధులు ,
3. రక్త దోషాలు ,
4. గుండె పోటు ,
5. తలనొప్పి ,
6. ఛాతి నొప్పి ఊపిరి తిత్తుల వ్యాధులు.
*సముద్రపు ఉప్పు ( Sea Salt )* 1930 కి ముందు ఉత్తర భారతీయులందరు సైంధవ లవణాన్నే వాడే వారు . ఆంగ్లేయులు దీన్ని నిషేధించి సముద్రపు ఉప్పును ప్రవేశ పెట్టారు. ఈ ఉప్పును తయారు చేయడానికి చాలా హానికరమైన రసాయనాలను కూడా ఇప్పుడు కలుపుతున్నారు. దీనిని ప్రాసెస్ చేసే ప్రక్రియలో 1200* పై వేడి చేస్తారు దాని వల్ల ఇది ఫ్రీఫ్లోగా వుండి జారి పోతుంది .సాధారణ ఉప్పులో 97.5 % సోడియం క్లోరైడ్ , 25% రసాయనాలతో కూడిన ఐయోడిన్ , పోటాషియం , అయోడైడ్ , సోడియం బయోకార్బోనేట్ , అల్యూమినియం , లవణం , సోడియం మోనో గ్లుటోమెట్ లు వున్నాయి. ఈ ఉప్పును నిత్యం వంటల్లో వాడటం వల్ల ఆరోగ్యానికి హానికారి.

7..పెరుగులో మనకు ఎంతో ప్రయోజనాన్ని కలిగించే బాక్టీరియా “అమృత తుల్యమైన” జీవజాలం ఉంటుంది. అది శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఆ పెరుగులో మనం ఉప్పేసుకుని తింటాం. ఇది చాలా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అలాంటి ఉప్పును పెరుగుతో కలిపి తింటే 20 రకాల జబ్బులకు గురి అవుతారు .

8. ఈ ఉప్పును వాడటం వల్ల వాత, పిత్త , కఫ దోశాలు కలుగుతాయి.
9. అయోడిన్ ఉప్పును వాడరాదు అయోడిన్ ఉప్పుని వాడితే శృంగార సామర్ద్యం ఖచ్చితంగా తగ్గి పోతుంది
10. అత్యంత ప్రమాదకరమైన Jaundice కామెర్ల వ్యాధులు వస్తాయి. అందుకే కిడ్నీ వ్యాధులూ జాండిస్ వ్యాధులూ రాగానే డాక్టర్లు మనకు ఉప్పును మానెయ్యమని చెప్తారు.
.
ఒక్క మాటలో చెప్పాలంటే మనం పప్పులో కూరల్లో ఈ ఉప్పు వేస్తున్నామంటే మనం మన ఇంటి గడ్డి వాములో నిప్పు వేస్తున్నామనే.. మనమే మనం పిల్లల జీవితాలకు నిప్పు పెట్టుకుంటున్నామనే…
ఉప్పు మానెయ్యండి.

సైంధవ లవణం మొదలు పెట్టండి.
.
ఈ సైంధవ లవణం ఉపయోగాలు
.
1. సైంధవ లవణం వేడి చెయ్యదు.
2. సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించడం వల్ల పైత్య సమస్యల నుండి బయటపడవచ్చు.
3. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది.
4. గొంతులో కఫం పేరుకుని ఊపిరాడనపుడు, కొద్దిగా సైంధవ లవణం, తేనె కలిపి చప్పరిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
5. సైంధవ లవణంలో సాత్విక గుణం అధికంగా వుంటుందని, మిగిలిన సముద్రపు ఉప్పు, నల్ల ఉప్పు వంటి లవణాలలో రజోగుణం ఉంటుందని ఆయుర్వేద వైద్యకోవిదులు చెప్తారు. దాని ఫలితం ఏవిటంటే గోటితో పోయేదానికి గొడ్డలి దాకాపోయే లక్షణాన్ని మనలో పెంచుతుందీ అని. అంటే కొట్లాటలకు దెబ్బలాటలకు దూకాలనిపించడం జరుగుతుంది.
6. కనుక జీవితంలో సమశ్యలను అలోచనతో పరిష్కరించాలనుకునే వారు,
ధ్యాన సాధన చేసేవాళ్ళు చెయ్యాలనుకునే వాళ్ళు, సైంధవ లవణం వాడడం మంచిది.
7. దీనిలో ఇనుప ధాతువులు వుండడం చేత, రక్త హీనతతో బాధపడే వాళ్ళు రక్తం పెరుగుతుంది.
8. ఇది అన్ని రకాల శరీర తత్వాలకు అనుకూలమైనది మాత్రమే కాక నిర్జలీయతను సైతం తగ్గిస్తుంది.
9. .జీర్ణానికి మంచిది: రాళ్ళ ఉప్పులో ఉండే కాల్షియం,మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు ఆరోగ్యానికి మంచిది. లాలాజలం, జీర్ణరసాల సమన్వయంలో ఇది తోడ్పడుతుంది.
10. దీనికున్న లక్షణంతో కడుపులో గ్యాస్ రాకుండా చేస్తుంది. యాంటాసిడ్ కూడా ఉన్నది
11. ఆయుర్వేదంలో ఈ సైంధవ లవణాన్ని సోంఫు, కొత్తిమీర పొడి మరియు జీలకర్రతో కలిపి తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది.
12. .ఆకలిని పెంచుతుంది: ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు మిరియాలు, అల్లం, పొడుగు మిరియాలు, ఏలకులతో కలిపి వాడితే ఆకలిని పెంచుతుంది.
13. బరువు తగ్గటం: ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు కొవ్వుని కరిగిస్తుంది. ఇందులో ఉండే ఖనిజ లవణాలు తీపిపై మక్కువను ఇన్సులిన్ ను తిరిగి జీవితం చేయటంతో తగ్గించటమే కాక, కొవ్వు కణాలను కూడా తొలగిస్తాయి
14. రక్తం కారే చిగుళ్ళకు చికిత్స: రాళ్ళ ఉప్పును ప్రాచీనకాలంలో పళ్ళను తెల్లగా చేయడానికి, నోటి దుర్వాసనకి పరిష్కారంగా వాడేవారు. త్రిఫల, వేప పౌడర్లతో కలిపి దీన్ని వాడితే చిగుళ్ల సమస్యలు నివారించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇదే రాళ్ళ ఉప్పు యొక్క అత్యుత్తమ లాభం.
ఈ సైంధవ లవణం(ఉప్పు) గనులు అత్యధికంగా హిమాలయాల్లో ఉన్నాయి.
.
ప్రతి రోజూ ఉదయం పూట పళ్ళు తోముకోకుండా తాగ గలిగినంత వేడినీరు కనీసం ఒక లీటర్ నుంచి ఒకటిన్నర లీటర్ తాగితే ఆ రోజునుంచి మల బద్దకం తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది.
Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading