సనాతన హిందూ ధర్మంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్దిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తాయి.మాఘమాసంలో చేసే స్నానాలకు ప్రత్యేకత ఉంది. దేవతలు తమ శక్తులను తేజస్సులను మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలామంచిది. పౌర్ణమి చంద్రుడు మఘ (మఖ) నక్షత్రంలో ఉండే మాసమే మాఘమాసం. ఈ సమయంలో సూర్యోదయం వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. కిరణాలు నీటిపై పడటం వల్ల నీరు చాలా శక్తివంతమవుతుందట. అందుకే జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు చాలా మంచివని చెబుతారు. మాఘమాసంలో సర్యోదయానికి ముందు నక్షత్రాలున్నపుడు చేసేస్నానం అత్యత్తమైనది. సూర్యోదయం తరువాత చేసే స్నానం వల్ల ఉపయోగంలేదు. ఇలాంటి స్నానాలు ప్రవాహజలాల్లో మరియు సాగరసంగమ ప్రదేశాల్లో చేస్తే ఇంకా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈరోజున తలస్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించాలి. కృష్ణా నది సాగరసంగమంలో – కృష్ణాజిల్లా అవనిగడ్డ, కోడూరు మండలంలోని హంసలదీవిలో కృష్ణానది సాగరంలో కలుస్తుంది. మాఘమాసంలో రాష్ర్టం నలుమూలల నుండి ఇక్కడ స్నానం చేయటానికి లక్షలాదిమంది వస్తారు. ఇక్కడ ప్రధాన ఆలయం వేణుగోపాల స్వామి. హంసలదీవికి వెళ్ళే మార్గం : కృష్ణాజిల్లా విజయవాడ నుండి అవనిగడ్డకు వరకు వెళ్ళి అక్కడ నుండి కోడూరుదాకా వెళ్లి కోడూరు నుండి ఉల్లిపాలెం మీదుగా హంసలదీవి వెళితే అక్కడ నుండి 5 కి.మీ. దూరంలో సాగరసంగమం ఉంటుంది.
మాఘమాసం
Google ad
Google ad
Raju's Resource Hub