Logo Raju's Resource Hub

వ్యాక్సిన్‌ వచ్చేసింది : కో-విన్‌ యాప్ రిజిస్ట్రేషన్‌ ఎలా?

Google ad
how to register Co-WIN app likely to be used for COVID-19 India vaccine  - Sakshi

కరోనా మహమ్మారి  అంతానికి దేశంలో తొలి స‍్వదేశీ వ్యాక్సిన్‌తోపాటు, మరో వ్యాక్సిన్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన తరుణంలో మొత్తం టీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, రియల్ టైమ్ కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీని పర్యవేక్షించడానికి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. 

గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ‘కొ-విన్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు ఈ నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులోకి లేదు. ఆరోగ్య అధికారులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు మాత్రమే నమోదుకు అనుమతి.  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్‌ వేస్తారు. టీకా కోసం ఇప్పటికే లక్ష మందికి పైగా  ఆరోగ్య సిబ్బంది నమోదు చేసుకున్నట్టు సమాచారం.  ఆ తరువాది దశలో కో-విన్‌ లో రిజిస్టర్‌ అయిన వారికే టీకా వేస్తారు. ముఖ్యం‍గా 50 ఏండ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి  టీకా లభించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన తరువాత ప్రజలు నమోదు చేసుకునేందుకు  ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు , ఇతర వివరాలను అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తదితరకార్డులను అప్‌లోడ్ చేసి నమోదు చేసుకోవచ్చు. భారత్‌లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా వాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

కో-విన్‌ : ఐదు విభాగాలు
దేశంలో సాధారణ టీకా కార్యక్రమాల కోసం కేంద్రం ‘ఈవిన్‌’ (ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) అని పిలుస్తారు. తాజాగా కొవిడ్‌-19 టీకాను కోట్లాది మంది భారతీయులకు  అందుబాటులోకి తెచ్చేలా అత్యాధునిక ఫీచర్లతో, ఆధునిక సామర్థ్యంతో కో-విన్‌ (కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) యాప్‌ను కేంద్రం తీసుకొస్తోంది.

  • రిజిస్ట్రేషన్‌, అడ్మినిస్ట్రేటర్‌, వ్యాక్సినేషన్‌, బెనిఫిషియరీ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌, రిపోర్టు అనే ఐదు విభాగాలుంటాయి. 
  • రిజిస్ట్రేషన్‌: ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌ వర్కర్స్‌ కానటువంటి సాధారణ ప్రజలు వ్యాక్సినేషన్‌ కోసం ‘కొ-విన్‌’లోని ‘రిజిస్ట్రేషన్‌ విభాగం’లో రిజిస్టర్‌ కావొచ్చు. దీనికి ఫొటో ఐడెంటిటీ అవసరం.
  • అడ్మినిస్ట్రేటర్‌: వ్యాక్సిన్‌ అవసరమైన ప్రజలు యాప్‌లో నమోదు చేసిన సమాచారాన్ని ఈ విభాగంలో అధికారులు పర్యవేక్షిస్తారు.  
  • వ్యాక్సినేషన్‌: వ్యాక్సిన్‌ పంపిణీ ఏ స్థాయిలో ఉన్నది? ఎంత మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు? అర్హుల జాబితా తదితర అంశాలు ఉంటాయి.
  • బెనిఫిషియరీ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌: టీకా వేసుకున్న లబ్ధిదారుల మొబైల్‌లకు ‘వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు’ ఎస్సెమ్మెస్‌ పంపిస్తారు. క్యూఆర్‌ ఆధారిత ధ్రువపత్రాన్ని కూడా జారీ చేస్తారు. 
  • రిపోర్టులు: ఎన్ని వ్యాక్సిన్‌ సెషన్లు పూర్తయ్యాయి? ఒక్కో వ్యాక్సిన్‌ సెషన్‌కి ఎంత మంది హాజరయ్యారు? ఎంత మంది గైర్హాజరయ్యారు వంటి రిపోర్టులు ఇందులో ఉంటాయి.

‘కో-విన్‌’లో రిజి స్ట్రేషల్‌ ఎలా?
యాప్‌లో రిజిస్ట్రేషన్‌, వివరాల నమోదులో భాగంగా ఫొటో ఐడెంటిటీని (ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పెన్షన్‌ ధ్రువ పత్రం) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తయ్యాక.. వ్యాక్సిన్‌ వేసే తేదీ, సమయం, ప్రాంతం వివరాలు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఎస్సెమ్మెస్‌ రూపంలో వస్తాయి.

Google ad
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading