
ఖర్జూరం చెట్టు నాటినప్పటి నుండి మూడవ సంవత్సరం నుండి దిగుబడి మొదలవుతుంది. గాలిలో తేమ తక్కువగా ఉండే ఉష్టప్రాంతాలలోని అన్నిరకాల నేలలోనూ ఈ చెట్లు ఎదుగుతాయి. Arecaceae చెట్ల జాతికి చెందినది
ఖర్జూర పంటకు చీడపీడలు తక్కువే. ఒకో చెట్టుకు 300 నుంచి 500 వందల కిలోల దాకా దిగుబడి వస్తుంది. ఈ చెట్లు 75 అడుగుల దాకా ఎదుగుతుంది. ఈ చెట్ల జీవితకాలం 150 సంవత్సరాలు అంటారు. ఈ చెట్టులోని ప్రతిభాగం విలువైనదే. కాండంను కలపగా వాడతారు. పొడవైన వీటి ఆకులను బుట్టలు తయారు చెయటానికి ఉపయోగిస్తారు.
ఈ చెట్ల జన్మస్థానం ఇరాక్ దేశమని చెబుతారు. మరియు ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లోని ఎడారి ప్రాంతాలలో ఖర్జూర చెట్లను ఎక్కువగా సాగుచేస్తారు. ఇంకా పాకిస్తాన్, ఇండియా, మెక్సికో దేశాలలో కూడా ఈ చెట్లను పెంచుతున్నారు. ఈజిప్ట్, ఇరాన్, సౌది అరేబియా, ఇరాక్ దేశాలలో ఖర్జూరం ఎక్కువగా పండుతుంది. ఈ దేశాల నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.
ఖర్జూరంలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్ సి మెండుగా లభిస్తోంది. పాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు ఖర్జూరంలో ఎక్కువగా లభిస్తాయి. చిన్నపిల్లల ఎదుగుదలకు మంచి ఆహారం. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కనుక మధుమేహంతో బాధపదేవారు ఖర్జూరాలకు దూరంగా ఉండటమే మంచిది.
Raju's Resource Hub