అంతులేని ప్రేమలో అంతు చిక్కకుండా దాగి ఉంటుంది ఈర్ష్య. ఇది లేని మనిషి ప్రపంచంలో దాదాపుగా ఉండడు. ఏదో ఒక మూల, ఎంతో కొంత ఈర్ష్య ప్రతి ఒక్కరిలో కచ్చితంగా ఉండే ఉంటుంది. దేన్నైనా అసంపూర్ణంగా అనుభూతి చెందినప్పుడు, మన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఎక్కువ ఉందని అనిపించినప్పుడు అది బయటపడుతుంది. మనం ఏదైనా ఒకదాన్ని అమితంగా ఇష్టపడితేనే ఈ భావన కలుగుతుంది. మన ఆలోచనలు దానిపైనే అల్లుకున్నప్పుడు.. అది మనది కాదేమో, దక్కదేమో అనే భయం, అభద్రతా భావంతోనే ఈర్ష్య పుడుతుంది. ఈర్ష్య ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈర్ష్యను పూర్తిగా అధిగమించడానికి ప్రయత్నించాలి. అందుకోసం మనం అసూయ చెందుతున్న విషయాన్ని మనమే గ్రహించి, కష్టమైనా సరే ఆ ఆలోచనల నుంచి బయటకు రావాలి. అవతలి వ్యక్తి అభిప్రాయాలు ఎవరి అధీనంలో ఉండవని అర్థం చేసుకోవాలి. ఈ భావన మనలో ఏర్పడుతుందంటే మనలోనే లోపం ఉందని అర్థం. ఆ లోపాన్ని గుర్తించాలే తప్ప ఇతరులను బ్లేమ్ చేయకూడదు.

ఈర్ష్య (Jealousy)
Google ad
Google ad
Raju's Resource Hub