ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నెనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతో చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను
ఇస్తాయి. ఆత్మవిశ్వాసం ఉన్నవారు కొత్త పనులను నేర్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
ఆత్మవిశ్వాసం లేని మనుషులు మాత్రం ఏ పని మొదలుపెట్టినా.. ఫలితం గురించి భయపడుతూ వెనకడుగు వేస్తారు. తనను తాను
నమ్మక, తనలోని శక్తిని తెలుసుకోలేడు. అలాంటివారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
తమను తాము ఇతరులతో పోల్చుకోకూడదు. మంచి మనుషులతో స్నేహం చేయాలి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
జరిగిన తప్పులకు కారణం తెలుసుకోవాలి. ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. ‘నా వల్ల కాదు,
నేను చేయలేను’ అనే ఆలోచన రానివ్వొద్దు. తరచూ నేర్చుకుంటూ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Raju's Resource Hub
