Logo Raju's Resource Hub

How to find best vegetables

Google ad

కూరగాయలు, ఆకు కూరలు వండేముందు శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగితే 80శాతం దాకా క్రిమి సంహారక అవశేషాలు పోతాయి. ఇంకా ఉడికించినపుడు, వేయించినపుడు ఇంకొన్ని నాశనమవుతాయి అని భరోసా ఇచ్చింది జాతీయ పోషకాహార సంస్థ నియమావళి.
కూరగాయలను ఆకుకూరలను ఉప్పు కలిపిన నీళ్ళలో శుభ్రంగా కడిగిన తరువాతే తరగాలి. తరిగాక కడగటం మంచిది కాదు.
కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోయటం వలన పోషక విలువలు తగ్గిపోతాయి. మరీ ఎక్కువసేపు నాన బెట్టటం వలన కొన్ని రకాల విటమిన్లు ఖనిజాలు కరిగిపోతాయి.వంటలలో నూనెలు తక్కువగా వాడాలి.నెయ్యి వెన్నలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

ఆకుకూరలు
కొత్తిమీర, పాలకూర, తోటకూర, ఏదయినా సరే ఆకుపచ్చ రంగులో ఉండి తాజాగా కనిపించాలి.ఆకులపై రంధ్రాలున్నా, వాడిపోయునా, ఎండిపోయినట్లున్నా, రంగుమారి కనిపించినా తాజావి కావనే అర్ధం. కొత్తిమీర ఆకుపచ్చ రంగులో ఉండి పొట్టిగా ఉంటే నాటు కొత్తిమీర అని అర్ధం. హైబ్రీడ్ రకాలు పొడుగ్గా లేతపచ్చ రంగులో ఉంటాయి.
దుంపలు
ముల్లంగి, క్యారెట్, బీట్ రూట్, బంగాళాదుంప, చిలగడదుంప …. వీటిని చేతిలోకి తీసుకుని చూస్తే బరువుగా ఉండాలి. తొక్క కూడామృదువుగాఉండాలి. మడతలు ఉండకూడదు.బంగాళాదుంపలకు ఆకుపచ్చ రంగు ఉండకూడదు. ఆకుపచ్చ రంగు ఉన్న భాగాన్ని తీసివేసినా అందులో సొలనైన్ అనే హానికరమైన రసాయనం ఉంటుంది. మొలకలు వచ్చిన బంగాళాదుంపలు కూడా మంచివి కావు.
తర్పూజా తొడిమ భాగంలో కొద్దిగా నొక్కితే అది మొత్తగా ఉంటే తర్బూజా బాగా పండినట్లు. లేదంటే వాసన చూడండి, తీపివాసన వస్తుంది. వాసన పెరిగే కొద్ది బాగా పండినట్లు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading