Google ad
- కొత్త హాబీల్ని నేర్చుకునేవాళ్లకి జీవితం నిత్యనూతనంగా ఉంటుంది. హాబీలు ఒత్తిడిని తగ్గించడమే కాదు, జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తాయి. పరిస్థితులు అనుకూ లంగా లేనప్పుడు మనకు ఆనందాన్ని కలిగిం చేవి హాబీలే గిటారు తీగల్ని మీటడం, ఫుట్ బాల్ ఆడటం, మొక్కల్ని పెంచడం. ఏదైనా కానీయండి మీ నుంచి ఒత్తిడినీ, ఒంటరితనాన్నీ దూరం చేస్తాయి.
- ఒకరు మనల్ని ఇష్టపదాలంటే ముందు మనల్ని ఇష్టపదాలి మాటలు, చేతలు, ఆహార్యం… ఈ అంశాల్లో ఎదుటవ్యక్తి ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో… మీలోనూ లక్షణాల్ని పెంపొందించుకోండి.
- ఒక పర్యటనకు వెళ్లివచ్చిన 3 ఆ వ్యక్తి మునుపటిలా ప్రవర్తించడంటారు. కారణం ఆ పర్యటన నేర్చిన పాఠాలతో పాత అలవాట్లను వదిలేసి, కొత్తగా ఆలో చిస్తారు. అందుకే మనలో కొత్త వ్యక్తి కనిపిస్తారు.
- ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమను చూపండి. సందర్భానుసారం ప్రశంసించడం, కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. మీకోసం ఏమీ చేయలేని వాళ్లకోసమూ ఏదైనా చేయండి. చేయడానికి సిద్ధంగా ఉండండి. జంతు ప్రేమ చూపడం అలాంటిదే.
- ఒంటరితనమనే ఆలోచనే రానీయకండి. అది మీకోసం మీరు కేటాయించుకోవడానికి దొరికిన అవకాశంగా చూడండి. ఆ సమయంలో పుస్తకాలు తిరగేసి కొత్త విషయాల్ని తెలుసుకోండి. సందర్భానుసారం జీవితభాగస్వామి, స్నేహితులతో వాటిని పంచుకోండి. దీంతో వాళూ మీతో సమయం గడపడానికి ఇష్టపడతారు. సినిమా చూడండి, మంట చేయండి. బయటకు వెళ్లి తినండి… ఏ పనిచేసినా మీకు 100 శాతం స్వేచ్ఛ ఉంటుంది.
Google ad
Raju's Resource Hub
