వివాహబంధాన్ని పదికాలాలపాటు కాపాడుకునే బాధ్యత దంపతులిద్దరి దీనూ. కానీ కొందరు చిన్నచిన్న విభేదాలనూ పెద్ద సమస్యలుగా చేసుకుంటారు. వాటిని పరిష్కరించుకోవాలి గానీ పెద్దది చేసుకోకూడదు అంటున్నారు నిపుణులు.
దంపతుల మధ్య ఏర్పడే చిలిపి తగాదాలు కొన్నిసార్లు పెద్దవవుతాయి. అటువంటి సంభాష ణలో వచ్చే మార్పును ఇరువురిలో ఏ ఒక్కరు గుర్తించినా దాన్ని అక్కడితో ఆపేయాలి. ఎదుటి. వారు కొనసాగిస్తున్నా కూడా నిశ్శబ్దంగా ఉంటే చాలు. లేదంటే ఆ చిలిపి తగాదా చివరకు చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం ఉంది. ఇది భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా దూరాన్ని పెంచుతుంది.. ఏ మాట మాట్లాడితే. భాగస్వామి ట్రిగ్గర్ అవుతున్నారో గుర్తించాలి. మరోసారి వాటిని మాట్లాడకుండా ఉండటానికి ఎదుటివారు ప్రయత్నిస్తే చాలు దంపతుల మధ్య సంభాషణ నిత్యం సంతోషంగా సాగుతుంది.
ఫిర్యాదులకు స్పందించొద్దు…
వైవాహికబంధంలో భార్యాభర్తల మధ్య వచ్చే కొన్ని సమస్యలకు చుట్టుపక్కలవాళ్ళు కారణమవు తుంటారు. ఎదుటివారు చెప్పే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని భాగస్వామితో కొందరు విభేదాలు పెంచుకుం టారు. ఇరువురిమధ్య మూడో వ్యక్తికి స్థానమి వ్వకుండా ప్రతి విష యాన్ని దంపతులు మాత్రమే చర్చించుకుంటే సమస్య ఉండదు. అలాగే ఒకరిపై మరొక రికి భరోసా ఉండాలి. అప్పుడే ఇతరులవల్ల సమస్యలొచ్చే అవకాశం తగ్గుతుంది.
అవమానించొద్దు..
ఒకరినొకరు విమర్శించుకొని మాటలతో అవమానించకోకూడదు. దీనివల్ల ఎదు. టీవారి మనసు గాయపడుతుందని గుర్తు పెట్టుకోవాలి. అలాగే గతంలో జరిగిన విషయాలను దెప్పుతూ మాట్లాడే అలవాటును కూడా మానుకో వాలి. అవతలివాళ్ల వల్ల నష్టం జరిగి ఉండొచ్చు. అలాగని జరిగినవాటిని ఏళ్లు గడుస్తున్నా మనసులో మోస్తూ ఉంటే అది మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది. అంతేకాదు, ఈ పద్దతిని మానుకోకపోతే భార్యాభర్తల్లో ఒకరిపై మరొకరికి ప్రతికూలభావన పెరుగుతుంది..
ఇగో వద్దు…
దంపతుల్లో తప్పు ఎవరిదైనా ఒకరి నొకరు క్షమించుకోవడం అలవాటు. చేసుకోవాలి. అలాగే తను తరపున పొరపాటు జరిగిందనిపిస్తే ఇగో ప్రద ర్శించకుండా అవతలివారికి క్షమాపణ చెప్పాలి. ఎంత దూరాన్నైనా దగ్గర చేసే శక్తి క్షమాపణకు ఉంది. సమస్య ఉన్నప్పుడు ఎవరికివారు సంఘర్షణకు లోనుకాకుండా కలిసి కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం దొరుకు తుంది. పాత అనుభవాల నుంచి పాఠాన్ని నేర్చుకుంటూ, బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇరువురూ ప్రయత్నించాలి
Raju's Resource Hub
