Vijayadashami is a celebration of resilience, the victory of good over evil, and the eternal promise that truth will always prevail. Let this day inspire us to conquer every challenge with grace and strength.
హిందూ క్యాలెండర్‌లో, దసరా లేదా విజయ దశమిగా పిలువబడే అత్యంత ముఖ్యమైన పండుగను ఆశ్వినీ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా అక్టోబరు 12వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. ఈ రోజున దుర్గామాత మహిషాసుర అనే రాక్షసుడిని సంహరించింది మరియు శ్రీరాముడు రావణుడిని దహనం చేసాడని పురాణాలు చెబుతాయి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటారు.
విజయ దశమి రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందుకాలాన్ని విజయ ముహూర్తం గా చెబుతారు. ఆ సమయంలో శమీవృక్షా(జమ్మిచెట్టు) న్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని ‘అగ్నిగర్భ’ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని అర్థం. దీనికే ‘శివా’ అనే మరో పేరుంది. అంటే సర్వశుభకరమైనదని. ‘మహాభారతం’ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచారు.