Logo Raju's Resource Hub

NOVEMBER 14 – WORLD DIABETES DAY

Google ad

ఈ వ్యాధి భయపడవలసినంత అనారోగ్యం కాకపోయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వ్యాధిగురించి తెలుసుకోవాలి.
డయాబెటిస్‌ లక్షణాలు అతిదాహం, అతి మూత్రం, బరువు తగ్గుదల, నీరసం, మెడకండరాల నొప్పి, కాళ్ళతిమ్మిర్లు వంటివి. ఈ వ్యాధికి కొన్ని ప్రధాన కారణాలు. జన్యులోపం, శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి టెలివిజన్‌ ముందు కూర్చోవడం, పోషక పదార్థాలు సక్రమంగాలేని ఆహారం (పాలిష్‌ చేసిన ధాన్యం, పప్పులు, వేపుడు కూరలు, రుచికోసం కొవ్వుల వాడకం అధికమవటం, మాంసాహారం, జంక్‌ఫుడ్‌ మొదలగునవి) వీటితో పాటు వేళకు ఆహారం తినకపోవడం. డయాబెటిస్‌ అంటే : మనం తిన్న ఆహారం జీర్ణమైన తరువాత తయారైన చక్కెరలు రక్తంలో కలసి ప్రయాణంచేస్తాయి. అలాంటి చక్కెరలను శరీర కండరాలలోనికి చేర్చేందుకు ఒక ప్రత్యేకమైన మార్గం అవసరం. ఆ మార్గం ఏర్పరిచేది ఇన్సులిన్‌ అనే హార్మోన్‌. ఈ హార్మోన్‌ రక్తంలో తగు మోతాదులో ఉన్నపుడే కణజాలాలు తమద్వారా చక్కెరలను స్వాగతిస్తాయి. ఇన్సులిన్‌ శరీరంలోని పాంక్రియాస్‌ గ్రంధిలో తయారవుతుంది. ఈ గ్రంధి వైఫల్యం వలన ఇన్సులిన్‌ ఉత్పత్తికాక, తగుమోతాదులో విడుదల కానందున రక్తంలోని చక్కెరలు కణజాలంలోకి చేరక రక్తంలోనే నిలిచి వుంటాయి.
రక్తంలో చక్కెర గాఢత పెరగడాన్నే డయాబెటిస్‌ అంటారు. ఈ గాఢత పెరిగిన కొద్ది రక్తాన్ని శుద్ధిచేసే మూత్రపిండాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అంత గాఢత ఉన్న రక్తం శుద్దిచేయలేక పోతున్నానని గాఢతను తగ్గించాలనే సంకేతం మొదడుకు పంపుతుంది. అందుకే వెంటనే మెదడు దాహం కలిగి ఎక్కువనీరు తీసుకునేలా చేస్తుంది. అలా అధికంగా త్రాగిన నీరును వడకట్టి బయటకు పంపాల్సివస్తుంది. దీనివలన తరచూ మూత్రవిసర్జన చేయవలసి వస్తుంది. అందుకే మనవారు అతిమూత్రవ్యాధి అని పేరు పెట్టారు.

ఇందులో టైప్‌ – 1 అని మరియు టైప్‌ – 2 అని రెండురకాలున్నాయి.

టైప్‌ – 1 : కొందరిలో అసలు ఇన్సులిన్‌ ఉత్పత్తి జరుగదు. ఇలాంటి వాటికి పరిష్కారం ఇన్సులిన్‌ను ఇంజక్షన్‌ ద్వారా ఎక్కిస్తారు. దీనినే డయాబెటిస్‌ టైప్‌ – 1 అని అంటారు. ఇది చిన్న వయసులో వస్తుంది. ఇది హఠాత్తుగా వస్తుంది.

టైప్‌ – 2 : ఇక భారతదేశం అందులో ఆంధ్రప్రదేశ్‌ ఈ టైప్‌-2 డయాబెటిస్‌ పేరు. ఇందులో ఇన్సులిన్‌ తగినంత ఉత్పత్తి కాదు. ఇది క్రమంగా వచ్చే మార్పు.పాంక్రియాస్‌ పనితీరు నెమ్మదిగా మందగిస్తుంది.ఈ వ్వాధిని అదుపులో వుంచుకొనకపోతే క్రమంగా కంటిచూపు మందగిస్తుంది. డయాబెటిస్‌ ప్రభావం వలన కంటి రక్తనాళాలు చిట్లవచ్చు. కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదంకూడా వుంది.

Google ad

డయాబెటిస్‌ వారు సమస్యకు తగ్గట్లుగా తమజీవన విధానాన్ని మార్చుకోవాలి. అసాధ్యం అన్నది లేనేలేదు. అసాధ్యమన్న దాన్ని నేను సాధ్యం చేసిచూపుతాను అనే పట్టుదల వున్నవాళ్ళకు డయాబెటిస్‌ అన్నది సమస్య కానేకాదు. వేళకు ఆహారం తీసుకోవడం, ఆహారనియంత్రణ, వ్యాయామం, కొద్దిదూరం నడవడం, లిఫ్ట్‌లు ఎక్కకుండా మెట్లదారి గుండా నడవడం, డయాబెటిస్‌ వచ్చినవారు వైద్యుల సలహా మేరకు తరచుగా తమ రక్తంలోని చక్కెరస్థాయిలను పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో చక్కెరస్థాయి పెరిగితే మూత్రపిండం మీద ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండం ఒకసారి దెబ్బతింటే తిరిగి కోలుకోవటం కష్టం. కనుక డయాబెటిస్‌ వారు వైద్యుల సలహా మేరకు మందులు వాడడం, ఆహారనియమాలు పాటించడం, వ్యాయామం మొదలగు వాటితో షుగర్‌వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలి.
డయాబెటిక్‌ న్యూరోపతి : నియంత్రణ లేకపోవడం వలన శరీర చివరి భాగాలు కాళ్ళు, చేతులు తిమ్మిరెక్కడం, స్పర్శ కోల్పోవడం జరుగుతంది. నాడీ సంభందిత ఇబ్బందులు కళ్ళు, గుండె, సెక్స్‌ అంగాలలో ఏర్పడతాయి. కింకి వచ్చే డయాబెటిక్‌ రెటినోపతి ప్రమాదకరం. అధిక చక్కెరల వలన కంటి రెటీనా దెబ్బతిని, చూపు తగ్గడం, శుక్లం ఏర్పడటం
నీటి కాసుల ఇబ్బందులు మొదలైన కంటి సమస్యలు రావచ్చు. రోగులు తమ రక్తపరీక్షతో పాటు తరచుగా కంటి పరీక్షను చేయంచుకోవాలి.

నివారణ : డయాబెటిస్‌ రోగులు తప్పనిసరిగా తమ జీవన విధానాన్ని మార్చుకోవాలి. పొగత్రాగటం, మత్తు పానీయాలను సేవించచటం పూర్తిగా మానాలి.. ఒత్తిడి, కోపం, ఆదుర్ధాలకు దూరంగా ఉండటం, డయాబెటిస్‌ రక్తపోటు కలిస్తే పక్షవాతానికి దారితీసే అవకాశం ఎక్కువ. ధ్యానం ద్వారా మనసును అదుపులో పెట్టుకోవచ్చును. కాళ్ళకు ప్రతిరోజూ ఉతికిన సాక్స్‌ ధరించి బూట్లు లేక ప్రత్యేక పాదరక్షలు ధరించటం చేయాలి. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం, వేళకి భోజనం చేయడం, తగినంత నిద్ర ఇలాంటి మంచి లక్షణాలు పాటించాలి. ఆహారంలో ఉప్పు పరిమితంగా తీసుకోవాలి. పిండి పదార్ధాలను అధికంగా తీసుకోవద్దు. పండ్లరసాలు, కోలా డ్రింకులు, చక్కెరతో, బెల్లంతో చేసిన తీపి పదార్ధాలు, తేనె మొదలగువాటిని మానివేయాలి లేదా వైద్య సలహామేరకు పరిమితంగా తినాలి. జంక్‌ఫుడ్‌, కొవ్వు పదార్ధాలు తినడం మానివేయాలి. డాక్టరు / డైటీషియన్ల సలహా మేరకు మీ ఆహారాన్ని తీసుకోవాలి.

హైపోగ్లెసీమియా : రక్తంలో చెక్కెరస్థాయిలు తక్కువైనా ఇబ్బందే. దీనిని హైపోగ్లెసీమియా అంటారు. కొంతమందిలో ఇది వస్తుంది. చక్కెర స్థాయి తగ్గితే చెమట పట్టటం, ఆదుర్ధా, వణకు, కాళ్ళలో మంట, హఠాత్తుగా ఆకలి, బలహీనత, కళ్ళుతిరగడం, తలనొప్పి సృహతప్పటం వంటివి వస్తాయి. ఇందుకు కారణం ఆహారం తీసుకోకపోవటం, పరిమితిని మించి వ్యాయామం చేయటం డయాబెటిస్‌ మందులను అధికంగా తీసుకోవడం ఇందుకు కారణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్‌ వేసుకొని కాఫీ లేదా టీ త్రాగాలి. పండ్లరసం తీసుకోవడం, ఒకస్పూన్‌ పంచదార నోట్లో వేసుకోవడం చేయాలి. హైపోగ్లిసీమియాకు గురయ్యేవారు ఈ సంగతి తమ తోటి వారికి చెప్పటం మంచిది.
డయాబెటిక్‌ రోగులు తినతగ్గవి మరియు ఆహార నియమాలు : డాక్టరు / డైటీషియన్ల ( పోషకాహార నిపుణుల) సలహా మేరకు సూచన మేరకు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.

రక్తంలో ఉండవలసిన చక్కెర పరిధి
భోజనానికి ముందు (ప్రీ – ప్రాండియల్‌) 70 – 130 mg/dl
భోజనం తరువాత ( పోస్ట్‌- ప్రాండియల్‌) 180 mg/dl
మూడు నెలల సరాసరి 7% కంటే తక్కువ
సాధారణంగా ఉండవలసిన రక్తపోటు
రక్తపోటు : 130 / 80 mm Hg
సాధారణంగా ఉండవలసిన కొవ్వులు
ట్రైగ్టిజరేడ్స్‌ 150 mg/dl మరియు అంతకంటే తక్కువ
LDL కొలెస్ట్రాల్‌ 100 mg/dl మరియు అంతకంటే తక్కువ
HDL కోలెస్ట్రాల్‌ (పురుషులు) mg/dl మరియు అంత కంటే ఎక్కువ
HDL కొలెస్ట్రాల్‌(స్త్రీలు) 50 mg/dl మరియు అంతకంటే ఎక్కువ

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading