Logo Raju's Resource Hub

గెలుపుని మధ్యలో వదిలేయకూడదు

Google ad

ఒకసారి ఓడిపోతే విజయం సాధించలేము అని కాదు ఇంకోసారి ప్రయత్నం చేయాలి ఆ ఓటమి మనకు మరింత ఓర్పును సహనాన్ని పెంచుతుంది కాబట్టి అనుకున్నది ఎప్పుడైనా సాధించవచ్చు. కొంత మంది ఒక ప్రయత్నం తోనే దానికి సాధించాలి అనుకుంటారు ఒకవేళ ఓటమి ఎదురైతే ఇంకో ప్రయత్నం మాటే రాదు కాకపోతే కొందరు పట్టుదలతో చాలా ప్రయత్నం చేసి సాధిస్తారు వీళ్లు ఒకసారి ఓటమిని ఎదుర్కొన్నా మరోసారి కి గెలుపొందచ్చు అని అభిప్రాయపడతారు

విజయం పొందాలనుకునే వారికి ఒక లక్ష్యం తప్పనిసరిగా ఉండాలి అదేంటంటే ఓటమిని స్వీకరించడం మరియు ఓటమి అనే భయం ఉండకూడదు దాంతో అదే ఒక పెద్ద పాఠంగా మనకి శక్తినిస్తుంది. ఒక లక్ష్యం పెట్టుకుని తరువాత వదిలేయడం అనేది వ్యక్తి పై ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తికి స్థిరత్వం, దృష్టి సంకల్పం వంటి ముఖ్యమైన లక్షణాలు ఉంటే తప్పకుండా విజయం దక్కుతుంది విజయం సాధించాలని కునేవారు విజయంతో పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని ముందే గమనించాలి.

పుట్టుకతోనే ప్రతిభ వచ్చేయదు కనుక వయస్సు తో పాటు ప్రతిభను పెంచుకోవాలి దాంతో విజయానికి ఒక అర్థం ఉంటుంది మరియు ఒక పనిని పూర్తి సామర్ధ్యంతో సరైన పద్ధతిలో చేయగలుగుతారు. ఒకవేళ సరైన పద్ధతిలో విజయం దక్కకపోతే ఆ విజయానికి అర్థమే ఉండదు మరియు దానితో పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. థామస్ ఆల్వా ఎడిషన్ ఒక బల్బు ని కనిపెట్టడానికి వేయి సార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ఆ తరువాతే విజయం పొందారు ఒకవేళ ఈ సార్లు చేసినా ఫలితం దక్కలేదని అక్కడే ఆగిపోతే ఆయనకు ఈ విజయం దక్కేది కాదు.

colonel sander 65 ఏళ్ల వయస్సు అప్పుడు కి 1009 సార్లు ప్రయత్నించి ఓడిపోయారు ఆయన చేసిన చికెన్ వంటకాన్ని ప్రతి ఇంటికి వెళ్లి అమ్మడానికి ప్రయత్నించేవారు కానీ ఆ వంటకాన్ని ఎవరూ అంగీకరించలేదు 1964లో అదే వంటకానికి చాలా డిమాండ్ పెరిగింది 600 ఫ్యాన్సీ కూడా ఏర్పడ్డాయి ఇప్పటికీ ఇది చాలా ప్రసిద్ధిచెందింది అదే కేఎఫ్సి చికెన్ దీంతో వయసు కి విజయానికి సంబంధం లేదని అర్థం చేసుకోవచ్చు.

Google ad

అబ్రహం లింకన్ పేదరికంలో పుట్టాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదిగాడు ఈయన రెండు సార్లు వ్యాపారాల్లో ఓడిపోయాడు దాంతోపాటు ఎనిమిదిసార్లు ఎన్నికలలో ఓడిపోయారుఈ కష్టాల తో పాటు పీఎం కి అబ్రహం లింకన్ కు నాడి కి సంబంధించిన మానసిక రుగ్మత కూడా ఏర్పడింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆయన జీవితాన్ని ముగించలేదు ఎన్నో సార్లు ప్రయత్నించి 1860లో ఆయన యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ గా నిలిచారు మరియు చరిత్రలోనే ఈయన గొప్ప ప్రెసిడెంట్ గా నిలిచారు

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading