దుబాయ్ ఎడారిదేశం… భానుడి ప్రతాపానికి తిరుగుండదు. చుక్క వాన కురవకపోయినా అద్భుతమైన పూలతోటల్నీ పెంచుతున్నారు. భూమ్మీద సముద్రాన్నీ, సముద్రంలో భూమినీ నిర్మించారు. ఎత్తైన కట్టడాలను ఆకాశంలోకి నిర్మించారు. నీటిలోని జంతుప్రదర్శనశాలలతో సాగర లోతుల్నీ చూపిస్తారు. మొత్తంగా ఎడారి జీవితాన్ని అద్భుతంగా తీర్చి దిద్దిన దుబాయ్… విలాసానికీ వినోదానికీ రాజరికానికీ రాజసానికీ నిలువెత్తు ప్రతిరూపం దుబాయ్. . బెల్లీ నృత్యానికి పేరుపొందిన దేశం దుబాయ్. రోడ్టు చక్కగా మెరుస్తూ ఉంటాయి
కార్నిచ్ బీచ్
అబుదాబిలోనే విలాసవంతమైన కార్నిచ్ బీచ్. అది సహజంగా ఏర్పడిన బీచ్ కాదు. సముద్రాన్ని కొంత దూరం మళ్లించిన నీటిపాయల వల్ల ఏర్పడిన బీచ్. తెల్లని ఇసుకనీ నీలి సముద్రాన్నీ చూస్తూ ఆనందించవచ్చు
అబుదాబి…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజదాని అబుదాబి. పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుందీ నగరం. రాజధాని కావడంతో అధికార కార్యాలయాలు ఎక్కువ. అన్నీ అద్దాల మేడలు, ఆకాశహార్మ్యాలు కనబడతాయి. ఎతిహాద్ టవర్స్, పైనాపిల్ బిల్డింగ్స్…వంటి ఆర్కిటెక్చర్ అద్భుతాలెన్నో కనిపిస్తాయి.
గ్రాండ్ మాస్క్ మసీదు
యూఏఈ జాతిపిత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహయాన్ స్వప్నమే ఈ మసీదు. ప్రపంచాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థనా మందిరం నిర్మించబడింది. పదేళ్లపాటు మూడువేల మంది ఈ మసీదు నిర్మాణంలో పాల్గొన్నారు. ఇందులోని ప్రార్థనా మందిరంలో ఉన్న కార్పెట్, షాండ్లియర్స్ ఈ మసీదుకి ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ప్రార్థనా మందిరం గోడమీద అల్లా 99 పేర్లు కనిపిస్తాయి. వందో పేరు అల్లాకే కనిపిస్తుందని అంటారు.
పామ్ జుమేరా బీచ్
ఈ బీచ్ మెట్రోలో ఖర్జూర చెట్టు ఆకారంలో నిర్మించిబడినది. పామ్ జుమేరా బీచ్ ప్రాంతం విలాసవంతమైన బీచ్ విల్లాలకు పెట్టింది పేరు. చిల్ ఈవినింగ్స్‌ను గడపాలనుకునే యూత్ మెచ్చే హ్యాంగవుట్ ప్లేస్. ఇండియన్, చైనీస్, థాయ్, జపనీస్, ఇటాలియన్, మెక్సికన్.. ఎన్నని చెప్తాం.. ప్రపంచంలోని అన్ని రుచులతో క్యుజైన్స్ ఘుమఘుమలాడుతుంటాయి. భారతీయ వంటకాలకు సంబంధించి ఇక్కడ బాంబే బంగ్లా ప్రసిద్ధి. ఈ రెస్టారెంట్ సెటప్ కూడా భారతీయ కోటను పోలి ఉంటుంది. ప్రతిరోజు ఆకాశంలో డ్రోన్స్ షో ఉంటుంది. షాపింగ్ ప్రియులకు ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ ఉంటాయి. విందువినోదాలతో జుమేరా బీచ్‌లో సాయంకాలాలను ఆనందంగా ఆస్వాదించవచ్చు. దుబాయ్ లో మరొక ప్రధాన పర్యటక ప్రాంతం అల్ అరబ్ హోటల్ దగ్గర ఉన్న బీచ్.
దుబాయ్ బంగారానికీ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికీ నిలయం. ఆసియా దేశాల నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు ఇక్కడినుంచి ఆఫ్రికాకు ఎగుమతి అవుతుంటాయి. దుబాయ్ మార్కెట్ లో సుగంధ ద్రవ్యాలు రాశులుగా పోసి అమ్ముతారు. ఇతరదేశాలతో పోలిస్తే దుబాయ్ లో బంగారం ధర తక్కువ. ఆభరణ ప్రియులకి పండగే.
దుబాయ్ మ్యూజియం
అరబ్బుల జీవనశైలి, ఆచార వ్యవహారాలు, వాళ్లు ఎదిగినతీరు అన్నీ ఈ మ్యూజియంలో కనబడాతాయి. మెరీనా మాల్లోని జెయింట్ వీల్ ఎక్కి అబుదాబి నగర అందాలను చూడవచ్చు.
ఎడారి సఫారీ!
దుబాయ్, షార్జా జంట నగరాలు. షార్జా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో డెజర్ట్ సఫారీ సెంటర్ ఉంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ ఈ సఫారీ ప్యాకేజీ సాగుతుంది. ల్యాండ్ క్రూయిజ్ కార్లలో సఫారీ మొదలౌతేంది. ఓ పక్క అప్పటివరకూ నిప్పులు కక్కి చల్లగా జారుకుంటున్న సూరీడు… దూరంగా ఎడారి ఓడల బారులు… ఇసుకతిన్నెలపై ప్రయాణిస్తూ కొండలూ లోయలూ… చూస్తూ ఆనందించవచ్చు. ఇసుకతిన్నెల మధ్యలో సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది.
బుర్జ్ ఖలీఫా – ఎత్తైన నిర్మాణం!
ప్రపంచంలోకెల్లా ఎత్తైన నిర్మాణం బుర్జ్ ఖలీఫా. ఇది ఎక్కడానికి రుసుము చెల్లించాలి. దుబాయ్ డౌన్టౌన్ అభివృద్ధిలో భాగంగా ఈ బుర్జ్ ఖలీఫాను నిర్మించారు. 160 అంతస్తుల ఈ భవనంలో పర్యాటకులను 125 అంతస్తుల వరకూ అనుమతిస్తారు. కేవలం ఒక్క నిమిషంలోనే లిఫ్ట్ లో పైకి చేరుకోవచ్చు. ఎత్తైన స్విమ్మింగ్ ఫూల్, మసీదు, ఎత్తైన నైట్ క్లబ్… ఇలా పదికి పైగా రికార్డులు బుర్జ్ ఖలీఫాకు ఉన్నాయి దుబాయ్ మాల్లోని రెండంతస్తుల ఆ అక్వేరియంలో 4,800 జాతులకు పైగా జలచరాలు ఉంటాయి.
రెండు టవర్లను కలిపే వంతెనే ఆ స్కై డెక్. ఆ వంతెన పై నుంచి ఉత్తరం దిక్కు చూస్తే పాత దుబాయ్ అంతా దర్శనమిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయిల్ నిక్షేపాలను కనుగొనకముందున్న దుబాయ్.. సముద్రంలో ముత్యాలు, చేపల వేట వృత్తులుగా ఉన్న ప్రాంతం, దుకాణాలు, పరిశ్రమలు, ఇళ్లు, ఓ మోస్తరు మిద్దెలు, మేడలు, క్రీక్.. కనిపిస్తాయి.. 360 డిగ్రీల కోణంలో. దక్షిణం వైపు.. అదే 360 డిగ్రీల కోణంలో నవీన దుబాయ్ గ్లామర్, నిలువెత్తు ప్రగతి, ఠీవి కళ్లకు కడుతుంది. మధ్యలో గ్లాస్ వాక్‌వే ఉంటుంది. అంటే నడిచేదారి.. కిందికి చూస్తే పాత, కొత్త దుబాయ్ అంతా 360 డిగ్రీల కోణంలో మనల్ని వెంబడిస్తుంది. ఈ స్కై డెక్‌లో వర్తమాన దుబాయ్ పూర్వాపరాలన్నీ ఉంటాయి.
Dubai Beautiful Clock Tower

గ్లోబల్ విలేజ్
ఆ సాయంకాలం గ్లోబల్ విలేజ్‌కు వెళ్లాం. దునియా మొత్తం దుబాయ్ ముంగిట్లో ఉందా అనిపించే ఉత్సవం అది. ప్రపంచాన్ని ఒక గ్రామంగా చూపించే ఎగ్జిబిషన్. 78 దేశాల సంస్కృతులు, రుచులు, అభిరుచులు, ప్రత్యేకతలు, ఉత్పత్తులు ఆయా దేశాల పెవిలియన్స్ (గుడారాలు)లో ఆకర్షిస్తుంటాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు 159 రోజులు సాగే ఈ గ్లోబల్ విలేజ్‌కి ప్రతిరోజూ 45 వేల మంది సందర్శకులు హాజరవుతుంటారు. పదహారు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు చెందిన 3 వేల అయిదు వందల షాపులు (రెస్టారెంట్స్‌ను కలుపుకొని), అడ్వెంచర్ గేమ్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్స్, మ్యూజియంలు, టీ కొట్లు, కెఫ్టీరియాలతోపాటు నాటకాలు, న్యత్యాలకు వేదికలూ కొలువుతీరి ఉన్నాయి. అయితే దేశాలకు ప్రాతినిధ్యం వహించే వాటిని దుకాణాలు అనకుండా పెవిలియన్స్ అంటారు. అలా అన్నిట్లోకి ఇండియాదే అతి పెద్ద పెవిలియన్. మన దేశానికి సంబంధించి 250 షాపులున్నాయక్కడ. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటిగంట దాకా ఉంటుంది. 92 దేశాలకు చెందిన పదివేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. 1997లో ప్రారంభమైన ఈ గ్లోబల్ విలేజ్‌కి 2021 సిల్వర్ జుబ్లీ ఇయర్. ఈ పాతికేళ్లలో ఒక్క ఏడు కూడా విరామం తీసుకోలేదు. ప్రతి సోమవారం మహిళలు, ఫ్యామిలీ స్పెషల్‌గా ఉంటుందీ గ్లోబల్ విలేజ్.
దుబాయ్ పార్కులు
అబుదాబి నుంచి దుబాయ్ కు వెళ్లే షేక్ జాయెద్ రహదారి పక్కన ఈ పార్కులు ఉన్నాయి. మోషన్ గేట్, లెగో ల్యాండ్, బాలీవుడ్ పార్కు మూడింటినీ కలిపి దుబాయ్ పార్కులు అంటారు. బాలీవుడ్ పార్కు అంతా హిందీ సినిమాలోకం. సల్మాన్, అమితాబ్ డూప్ల నృత్యాలు ఆకట్టుకుంటాయి
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లవచ్చు.
What are the mind-blowing facts about Dubai?
1. According to the Guinness Book of World Records, the Dubai Mall is the largest mall in the world in terms of total area
2. The Palm Islands in Dubai are some of the world’s largest man-made islands.
The project Palm Jumeirah is one of the most iconic developments in Dubai. Palm Jumeirah is cited as a great residential area in Dubai and has innumerable leisure activities that keeps expat families entertained. The most amazing fact about palm Jumeirah is that close to 94 million cubic metres of sand and 7 million tons of rock was used to build this architectural wonder. With more than hundred feasibility studies and intense planning done, several experienced divers were employed to examine the stability of the rock formations beneath the water. Its first time in history that this unique structure was built using land reclamation.
Another amazing fact is that this man made island can be viewed from space. Often claimed as the eighth wonder of the world, it houses UAE’s attractions like the luxurious Atlantis Hotel, Trump International etc. Palm Jumeirah is home to its own monorail, malls, luxury apartments as well as schools.
Owing to the work of dedicated building management teams in the region, Palm Jumeirah is known to have high rents and all sold out units. It was noted that the first phase properties consisting of 4000 units all sold off in a time span of 72 hours from the initial sales release. With more and more buyers moving into the region it would mean basic amenities need to be provided like restaurants, nurseries, schools, boutiques and even pest control services. A reliable jumeirah pest control company offering their expert services needs special mention here. Armour Pest Control Services offer their professional services round the clock. It is interesting to note that Armour also participates in programs to spread awareness about pest infestation and the problems caused and also offer preventative treatments to inhibit infestation.
3. There are no rivers in the entire country.
4. Because of a growth boom in 2009, much of Dubai was not connected to the city’s sewer system yet. Excrement and waste had to be hauled away in trucks.
5. The world’s largest indoor theme park is in Abu Dhabi. It is owned by Ferrari and is home to the Formula Rossa, the world’s fastest roller coaster.
6. In order to keep up with the kinds of cars that people drive in the UAE, the police force uses Lamborghinis, Bentleys, and Ferraris.
7. In the UAE, if you want to drink alcohol (even in your own home) you need to get a license.
8. Abu Dhabi is building a city that will be entirely powered by solar energy (Masdar City).
9. From a total populace of over 9 million individuals, only 1.4 million are people. The others tend to be employees from overseas (usually Asia) which have visited make their particular fortunes. This means almost 90percent of this populace is international.
10. Abu Dhabi has the majority of the Chrysler Building in New york.
11.Dubai, United Arab Emirates – 1980´s and today.