చరిత్రాత్మక ప్రాధాన్యం కల మరియు సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో కలవు. బొర్రా గుహలు ఉనికి 1807లో విలియం కింగ్ అనే బ్రిటీష్ బౌగోళిక శాస్త్రవేత్తచే కనిపెట్టబడినది. సముద్రమట్టానికి 1400 మీటర్ల ఎత్తులో గుహలు ఉన్నవి. ఈ గృహలో శివలింగాన్ని మరియు కామధేనువు విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు. సహజంగా ఏర్పడ్డ ఈ గృహలు ఆవు పొదుగు ఆకారంలో ఉండి ఒక ఒక మిలియన్ (10 లక్షల) సవంత్సరాల క్రితంవిగా భావించబడుచున్నవి. బొర్రా గుహలో జరిపిన తవ్వకాలో 30 వేల నుండి 50 వేల సంవత్సరాల క్రితం నాటి రాతిపనిముట్లు భించాయి. దీనిని బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖ ఈ గుహలను స్వాధీనం చేసుకుని గుహల బయట ఉద్యానవనాలను, మొక్కలను పెంచటంతో ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మారిందిల. గుహ లోపల భాగంలో విద్యుత్ దీపాలతో అంకించారు.
ఎలా వెళ్ళాలి ?
బొర్రా గుహకు విశాఖపట్నం నుండి రైలు మరియు బస్సు మరియు సొంత వాహనాలో వెళ్ళవచ్చు. విశాఖపట్నం నుండి అరకులోయ వెళ్ళే దారిలో విశాఖపట్నం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఈ గుహల కలవు. అరకునుండి తిరుగు ప్రయాణంలో బొర్రా గుహలను చూడవచ్చు.
Raju's Resource Hub

