







అరకులోయ విశాఖపట్నం డుంబ్రీగూడ మండలానికి చెందిన గ్రామము. సముద్రమట్టానికి 600 నుండి 800 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 120 కిలోమీటర్లదూరంలో ఉన్న అరకులోయ ఆహ్లాదకరమైన వాతావరణంతో, కొండలు, లోయలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అరకు లోయ ప్రయాణం ఒక గొప్ప అనుభూతి. విశాఖపట్నం నుండి అరకు వెళ్లే దారిలో పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, మల్బరీ తోటలు, సిల్క్¬ ఫారం మరియు అనంతగిరి కాఫీ తోటలను చూడవచ్చు.
అరకు వెళ్లేటపుడు రైలు ప్రయాణం, తిరుగు ప్రయాణంలో బస్ ప్రయాణం చేస్తే అన్ని ప్రకృతి దృశ్యాలను చూడటానికి వీలవుతుంది.ఈ ప్రయాణం సుమారు 5 గంటలసేపు సాగుతుంది. 58 సొరంగమార్గాలు,64 వంతెనల మీద నుండి సాగే ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు వెళ్లేదారిలోనే బొర్రాగుహలు ఉన్నాయి.
అరకులోయలో కాఫీతోటలు పేరుపొందినవి. గిరిజనులు రసాయనిక ఎరువులు వాడకుండా పండిస్తారు. ఈ కాఫీ పౌడర్ ‘ఎమరాల్డ్’ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోతుంది. ఆకర్షణలు గిరిజనులు తయారు చేసే వస్తువులు, గిరిజనాభివృద్ధి సంస్థ అమ్మే స్వచ్ఛమైన తేనె కొనవచ్చు. ఇక్కడికి 15 కి.మీ. దూరంలో ఉన్న తాటిదూడ, కటికి, చప్పరాజ్ అనే ప్రదేశాలు మంచి పిక్ నిక్ ప్రదేశాలు. గిరిజనుల సంస్కృతిని తెలిపే ట్రైబల్ మ్యూజియంను చూడవచ్చు. అరకులోయలో 19 గిరిజన తెగలవారు తమ పురాతన సంస్కృతిని కాపాడుకుంటూ నివసిస్తున్నారు. ఇటికాల పొంగల్ అనే పండుగరోజున చేసే సాంప్రదాయక నృత్యం చాలా పేరుపొందినది. ఇప్పుడూ రోజూ పర్యాటకులకోసం నృత్యం ప్రదర్శిస్తున్నారు. సముద్ర మట్టానికి 3,800 అడుగుల ఎత్తు ఉన్న గాలి కొండలు అనే ప్రదేశాన్నుండి అరకులోయ మొత్తాన్ని చూడవచ్చు.
విస్టాడోమ్ బోగీ ప్రత్యేకం…..
విశాఖ నుంచి అరకు దూరం 130 కిలో మీటర్లు. విశాఖ నుండి రైలు ఉదయం ఏడు గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు పదిన్నరకు బొర్రాగుహలు 11 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ రైలుకు ప్రత్యేకంగా ఒక విస్టాడోమ్ అనే భోగి అమర్చారు. ఈ భోగి మొత్తం అద్దాలతో నిర్మించబడింది. 40 సీట్లున్న ఈ బోగీలో అనంతగిరి అడవుల సౌందర్యం, ఎత్తయిన కొండలు, సొరంగమార్గాలు, జలపాతాల అందాలను మిస్సవకుండా చూడవచ్చు. రైలు వేగం గంటకు 30 కి.మీ. మాత్రమే. ఈ బోగీ రైలుకు చివరిలో అమర్చుతారు. బోగి చివరిలో లాంజ్ కూడా ఉంది. కానీ పదిమంది మాత్రమే నిల్చుని చూసే వీలుంది.
విస్టా డోమ్ ట్రైన్ కంపార్ట్మెంట్ ఒక్కటే ఉంది. టిక్కెట్లు 56 ఉంటాయి. తలకి 750/- టికెట్. వైజాగ్ లో ఉదయం 6 కి ట్రైన్ ఎక్కితే 11 గంటలకి బొర్రా గుహల దగ్గర దిగవచ్చు. అందులో సీట్ ని ఇలా పూర్తిగా తిప్పుకుని బయటకి చూడటానికి అవకాశం ఉంది.
రైలు ప్రయాణం ఓ అద్భుతం…
అరకులోయకు రైలు ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. బోలెడు జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. విశాఖలో ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండోల్ పాసింజర్ రైలు బయల్దేరుతుంది. ఇందులో ప్రయాణమంటే పర్యాటకులకు అమితమైన ఇష్టం. కొండల నడుమ సాగే ఆహ్లాదకర ప్రయాణంతో పర్యాటకులు పరవశిస్తారు. విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలోని బొడ్డవర ప్రాంతం నుంచి అరకులోయ సమీపంలోని కరకవలస వరకు రైలు ప్రయాణం ఎత్తైన కొండల నడుమ సాగుతుంది. కొండలను చీల్చి గుహలలో నిర్మించిన రైలు మార్గం పర్యాటకులను మరింత ఆకట్టుకుంటుంది. చిన్నారులు, విద్యార్థులంతా టన్నెల్స్ మధ్య రైలు ప్రయాణాన్ని చూసి తెగ సంబరపడతారు. పగలు కూడా ఈ కొండల మధ్య టన్నెల్స్ దాటే సమయంలో చీకటి ఆవరిస్తుంది. ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది.


ప్రత్యేకతలివే…
►ఈ మార్గంలో మొత్తం 52 టన్నెల్స్ ఉన్నాయి.
►బొర్రా–చిమిడిపల్లి స్టేషన్‌ల మధ్య 900 మీటర్ల పొడవైన భారీ టన్నెల్ ఉంది.
►ఈ టన్నెల్‌ను రైలు దాటేందుకు 20 నిమిషాలు పడుతుంది.
►మిగతా టన్నెల్స్ 200 మీటర్ల లోపునే ఉంటాయి.
►ఘాట్ మార్గం కావడంతో రైలు ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది.
►బొర్రా గుహలు మీదుగానే రైలు పట్టాలు ఉండడం మరో ప్రత్యేకత.
►రైలు ప్రయాణమంతా దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగుతుంది.
►ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలు, అక్కడక్కడా దర్శనమిచ్చే జలపాతాలను చూస్తూ పర్యాటకులు మంత్ర ముగ్థులవుతారు.
ప్రదేశ ఆకర్షణలు అరకు వాలీ లో కాఫీ తోటలే కాక ట్రైబల్ మ్యూజియం, టిఅడా , బొర్రా గుహలు, సంగదా ఫాల్స్ మరియు పద్మాపురం బొటా నికల్ గార్డెన్స్, వంటి ఆకర్షణలు కలవు. ప్రకృతి అందించే మంచి సువాసనల ఈ తోటలను తప్పక చూడాలి. అయితే, పర్యాటకులు అరకు వాలీ ఆకర్షనలను వాటి చరిత్ర, సంస్కృతి అర్ధం చేసుకునేటందుకు తప్పక చూడాల్సిందే.
బొర్రా గుహలు
లైటింగ్ ఎఫెక్ట్ తో ఫోటోలు దిగటానికి లోపల రెండు మూడు చోట్ల ఏర్పాట్లు ఉన్నాయి. 50/- కి ఒక ఫోటో తీసిపెడుతున్న వాళ్ళూ ఉన్నారు.

కటికి వాటర్ ఫాల్స్
అక్కడ సొంత కార్ లేక పోతే జీప్ లో వెళ్ళటానికి మాత్రమే అనుమతిస్తున్నారు. జీప్ ఒక్కొక్కరికి 200/- మొత్తం జీప్ 1600/-. జీప్ లో మళ్ళీ పావుగంట ప్రయాణం. ఆ తరువాత 10–15 నిమిషాలు కొండలు గుట్టలో నడవాలి. ఆ దారిలో ఒక రైల్ టన్నెల్ కనపడుతుంది. అలాగే రైల్వే ట్రాక్ దాటాక వాటర్ ఫాల్స్ ఉంటుంది.
గాలికొండలు వ్యూ పాయింట్

చాపరాయి

బాగు.. యాపిల్ సాగు…
యాపిల్ సాగు అంటే అందరికీ కాశ్మీర్‌లోయ గుర్తొస్తుంది. అరకులోయ కూడా యాపిల్ సాగుకు అనుకూలంగా ఉంది. పాడేరు ఐటీడీఏ, హారీ్టకల్చర్ శాఖలు ప్రయోగాత్మకంగా అరకులోయ మండలంలోని పద్మాపురం, చినలబుడులో మూడేళ్ల క్రితం యాపిల్ సాగుకు గిరిజన రైతులను ప్రోత్సహించాయి. అరకులోయలోని చల్లని వాతావరణం యాపిల్ సాగుకు అనుకూలంగా ఉండడంతో రెండేళ్ల నుంచి ఇక్కడ సిమ్లా యాపిల్స్ విరగ్గాస్తున్నాయి. అలాగే స్టాబెర్రీ పంటకు అరకులోయ ఖ్యాతిగాంచింది.
ఘాట్ రోడ్‌లో అందాలు భలే…
విశాఖపట్నం నుంచి అరకులోయకు ఉన్న రోడ్డు మార్గంలో కూడా ప్రకృతి అందాలు పర్యాటకుల్ని పలకరిస్తాయి. కొండల నడుమ ఘాట్‌రోడ్డులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. ఎత్తైన గాలికొండ ప్రధాన ఆకర్షణ. అలాగే దారి మధ్యలో కాఫీతోటలు కనువిందు చేస్తాయి. ఈ తోటల్లో చల్లని వాతావరణం మధ్య ప్రయాణం ఒత్తిడిని దూరం చేస్తుంది.
సంప్రదాయాలకు ప్రతీకలు…
అరకులోయను సందర్శించే పర్యాటకులు, చిన్నారులకు గిరిజన మ్యూజియ, పద్మాపురం గార్డెన్‌లు ఘన స్వాగతం పలుకుతాయి. గిరిజన మ్యూజియంలో గిరిజన ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే కళాకృతులు ఉన్నాయి.
ఇక్కడ బోటు షికారు కూడా ఏర్పాటు చేశారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్‌లో పూలు, పండ్ల జాతుల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ టాయ్‌ట్రైన్‌లో ప్రయాణం చిన్నారులను ఆకట్టుకుంటుంది.
అనంతగిరి కొండలపై కాఫీ తోటలు

అనంతగిరి కొండలపై కల కాఫీ తోటల సువాసనలు వాలీ అంతా వ్యాపించి వుంటాయి. మైళ్ళ తరబడి కాఫీ తోటలు వ్యాపించి వుంటాయి.వాలీ గిరిజనుల చరిత్ర లో ఈ కాఫీ తోటలకు ప్రధాన స్థానం కలదు. ఈ కాఫీ ఎస్టేట్ లు వారికి ఒక ఉపాధి ఏర్పరిచి వారిని అందరి జీవన స్రవంతి లో కలిసే లా చేసాయి. ఇండియా లో మొట్ట మొదటి ఆర్గానిక్ కాఫీ అరకు వాలీ లోనే పండించబడింది. అరకు ఎమరాల్డ్ గా ప్రసిద్ధి చెందిన ఈ కాఫీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ కాఫీ ఎస్టేట్ ల వారు పర్యాటకులకు గెస్ట్ హౌస్ ఏర్పాట్లు కూడా చేస్తారు.
సంగద వాటర్ ఫాల్స్

సంగద వాటర్ ఫాల్స్ అందమైన తూర్పు కనుమలలో అరకు వాలీ లో ఒక భాగం గా కలవు. ఈ జలపాతాలు సంగద అనే గ్రామానికి సమీపం గా వుండటం తో వాటికి ఆ పేరు వచ్చింది. ఈ జలపాతాలు, ఎంతో సుందరమైన ప్రదేశం లో ఆకర్షణీయంగా ఉండటంతో ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలం గా పేరు పడింది. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యలో వున్నాయి. జలపాతాల హోరు తప్ప ఇక్కడ ఇంక ఎ శబ్దం వుండదు. ఇది ఒక పిక్నిక్ స్పాట్ గా వుంటుంది. ప్రజలు వారి కుటుంబాలతో వచ్చి ఆనందిస్తారు. రోడ్డు మార్గం లో ఇక్కడకు తేలికగా చేరవచ్చు.
ఎప్పుడు వెళ్లవచ్చు ?
సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా అరకులోయకు వెళ్లవచ్చు. కానీ శీతాకాలంలో వాతావరణం మైనస్ నాలుగు డిగ్రీలకు పడిపోతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లటం మంచిది. వర్షాకాలంలో వెళ్లేవారు గొడుగులు, రెయిన్ కోట్స్ తీసుకు వెళ్లటం మంచిది. వర్షాకాలంలో వాతావరణం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలికాలంలో పలిస పూలతో కొండలన్నీ కప్పబడి పసుపు వర్ణంతో ఎంతో అందంగా ఉంటాయి. ఆగష్ట్ నుండి యాత్రికుల సందడి ఎక్కువగా ఉంటుంది.
వసతి సౌకర్యం
అరకు లోయలో అన్నితరగతుల వారికి అందుబాటులో కాటేజెస్, లాడ్జీలు, గెస్ట్ హౌసెస్ కలవు. కాని ముందుగా వసతి రిజర్వేషన్ చేసుకుంటే తరువాత వెతుకులాట తప్పుతుంది
ఎలా వెళ్లాలి ?
విశాఖపట్నం నుండి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా అరకులోయకు వెళ్లవచ్చు. విశాఖ ఈశాన్య రైల్వే లైన్ లో కొత్తవలస – కిరండల్ రైలు మార్గంలో అరకు మరియు అరకులోయ అనే రెండు స్టేషన్లు వస్తాయి. విశాఖపట్నానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో అరకులోయ ఉన్నది.
Raju's Resource Hub